జాతీయ వార్తలు

మూడ్.. మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలతో దూసుకుపోతున్న మోదీ ప్రభుత్వానికి ఇపుడు మరింత బలం చేకూరింది. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్’ భారత సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను ఉన్నతీకరించింది. భారత క్రెడిట్ రేటింగ్‌ను అత్యల్ప పెట్టుబడి స్థాయి ‘బిఏఏ 3’ నుంచి ‘బిఏఏ 2’కు అమెరికాకు చెందిన ‘మూడీస్’ సవరించింది. భారత క్రెడిట్ రేటంగ్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేయడం గత పదమూడేళ్లలో ఇదే ప్రథమం. వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో 13 సంవత్సరాల క్రితం భారత్‌కు ‘మూడీస్’ సంస్థ ‘బిఏఏ 3’ రేటింగ్‌ను ఇచ్చింది. ఆ తర్వాత రేటింగ్‌ను పెంచడం అన్నది ఇపుడు మోదీ హయాంలోనే జరిగింది. అవుట్‌లుక్ ఇండియా రేటింగ్ సైతం సానుకూలం నుంచి స్థిరత్వానికి మారింది. క్రెడిట్ రేటింగ్ దేశ ద్రవ్య, ఆర్థిక, నియంత్రణ విధానాలకు కొలమానంగా నిలుస్తాయి. మంచి రేటింగ్స్ గనుక ఉంటే సంబంధిత దేశం, కంపెనీలు అంతర్జాతీయ విపణిలో అధికంగా పెట్టుబడులను సమీకరించే అవకాశం కలుగుతుంది. కాగా, మరోవైపు అధిక రుణభారం భారత క్రెడిట్ ప్రొఫైల్‌కు ఆటంకంగా మారే ప్రమాదం లేకపోలేదని ‘మూడీస్’ హెచ్చరించడం గమనార్హం. చాలా కీలకమైన సంస్కరణలు
ఇంకా రూపకల్పన దశలోనే ఉన్నాయన్న ‘మూడీస్’ ఇప్పటివరకూ అమలు చేసిన సంస్కరణలతో భారతదేశంలో వాణిజ్య వాతావారణం, ఉత్పాదకతలు పెరుగుతున్నాయని, దేశీయ, విదేశీయ పెట్టుబడులు కచ్చితంగా వృద్ధి చెందుతాయని, ఎట్టకేలకు బలమైన, స్థిరమైన అభివృద్ధి దిశగా భారత్ ముందుకు సాగుతుందన్న విశ్వాసాన్ని ‘మూడీస్’ వ్యక్తం చేసింది. మార్చి 2018తో ముగిసే ఆర్థిక
సంవత్సరానికి భారత జీడీపీ 6.7గా ఉంటుందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. కాగా, మూడీస్ ఇచ్చిన క్రెడిట్ రేటింగ్స్ భారత స్టాక్ మార్కెట్లకు వరంలా మారి లాభాలను చవిచూశాయి.
సంస్కరణలు ఆగవు: జైట్లీ
తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ‘ఆలస్యంగా గుర్తింపు’ వచ్చిందని ‘మూడీస్’ రేటింగ్స్ ఇచ్చిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో వౌలిక సదుపాయలను ముఖ్యంగా గ్రామసీమల వికాసానికి తమ ప్రభుత్వం మరెన్నో సంస్కరణలను ఇకముందు కూడా అమలు చేస్తుందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వస్తు సేవా పన్ను (జీఎస్టీ), ద్రవ్య విధానంపై నియంత్రణ, రుణపరపతి, ఇతర ఆర్థిక సంస్కరణలతో ‘మూడీస్’ రేటింగ్ దక్కిందని అంటున్నారు. కాగా, ప్రపంచ బ్యాంకు వ్యాపార ర్యాంకింగ్‌కు సంబంధించి ఇచ్చే రేటింగ్‌లో భారత్ పురోగతి సాధించిన కొద్ది వారాల్లోనే ‘మూడీస్’ రేటింగ్ వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని జైట్లీ గుర్తుచేశారు. ఆర్థిక రంగంలో ఇదే క్రమశిక్షణ ఇకముందు కూడా కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
మరి కొద్ది నెలల్లో దాదాపు ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2019లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంస్కరణల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆందోళన లేకపోలేదు. సమర్థవంతమైన పాలనలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉపాధి రేటు, ఆర్థిక రేటు, పెట్టుబడుల చైతన్యం వంటి విషయాల్లో ప్రభుత్వం ఏమి చెప్పిందో ఆ దిశగానే పనిచేస్తోందని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ తెలిపారు. ఆర్థిక, వ్యవస్థీకృత సంస్కరణల కారణంగానే భారత్ రేటింగ్ పెరిగిందన్నారు. ‘మూడీస్’ రేటింగ్‌తో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగుపడే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
*
బొంకేదియొ నిజమేదో
అంకెల రేటింగునందు అగపడదయ్యా
అంకెల నిచ్చెననెక్కుచు
చంకలు గుద్దుకొనజూడ చతికిలబడమా!