జాతీయ వార్తలు

నేను నీకంటే చిన్నవాడినే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సాయంత్రం ఇండియా గేట్ వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహించింది. బిజెపి కార్యకర్తల సందడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ‘ఏక్ నరుూ సుబహ్’ పేరుతో దాదాపు అయిదున్నర గంటల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు, సాధించిన విజయాలులాంటి వివిధ అంశాలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ షోలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గొప్ప ఆకర్షణగా నిలిచారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ థీమ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరించిన అమితాబ్ పలువురు చిన్నారులు అడిగిన ప్రశ్నలకు ఎంతో సంయమనంతో, సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడో తరగతి చదువుతున్న సుగమ్ అనే బాలిక అడిగిన ప్రశ్నకు అమితాబ్ ఇచ్చిన సమాధానం అందరినీ అలరించింది. ‘మీరు బిగ్ బి ఎలా అయ్యారు?’ అని సుగమ్ అడగ్గా, ఆయన తడుముకోకుండా అది మీడియా పెట్టిన పేరు మాత్రమేనని, ఇక్కడ నేను నీకంటే చిన్నవాడినంటూ వేదికపైనే కూర్చుండిపోయి బాలికలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు రాసిన రెండు కవితలను కూడా చదివి వినిపించారు. స్ర్తి, పురుషుల మధ్య తేడాలు లేవని చెప్పడమే బేటీ బచావో, బేటీ పఢావో పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మన మతం, సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని కూడా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేరువైన పథకాలపై ఇచ్చిన ప్రజంటేషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు,గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బబుల్ సుప్రియో, సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్-్ధన్ యోజనపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, గ్రామీణ విద్యుదీకరణపై బిజెపి ఎంపి మనోజ్ తివారీ, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు మాట్లాడారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, చౌదరి బీరేంద్ర సింగ్‌లు స్వచ్ఛ్భారత్ అభియాన్ సాధించిన విజయాలను వివరించారు. చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరో కేంద్ర మంత్రి మనేకాగాంధీ వివరించారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ స్వచ్ఛ్భారత్ అభియాన్ హైలెట్లను వివరించారు.
ముఖ్యంగా ‘మేరా దేశ్ బడ్ రహాహై.. ఆగే బడ్ రహాహై’ అంటూ సాగిన గీతం అందరినీ అలరించింది. అయిదున్నర గంటల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని పది సెగ్మెంట్‌లుగా విభజించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్న కార్యక్రమాలను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

చిత్రం ఇండియా గేట్ వద్ద జరిగిన ఏక్ నయా సుబహ కార్యక్రమంలో బాలికతో సంభాషిస్తున్న అమితాబ్