జాతీయ వార్తలు

దేనికైనా చర్చలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 17: ఏ సమస్యకైనా చర్చలే సరైన పరిష్కార మార్గాన్ని చూపుతాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ శుక్రవారం నాడిక్కడ స్పష్టం చేశారు. కోర్టు తీర్పులకంటే కూడా చర్చల ద్వారా జరిగే పరిష్కారాలు తరతరాలుగా గుర్తుండిపోతాయని అన్నారు. అయోధ్య సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో భాగంగా వివిధ ముస్లిం సంస్థల నాయకులతో జరిపిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం వివిధ మతాలకు చెందిన నాయకులతో భేటీ అయిన అనంతరం రవిశంకర్ ముస్లిం పెద్దలను కలుసుకుని అయోధ్య సమస్య పరిష్కార మార్గంపై చర్చించారు. ఎంత జటిల సమస్యనైనా, సంక్షిష్ట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న ఆయన ‘కోర్టు తీర్పులు శిరోధార్యం, గౌరవనీయం అయినప్పటికీ వాటి వల్ల వైరిపక్షాల హృదయాలు చేరువ కావు. చర్చల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించగలిగితే అన్ని విధాల అనుకూలమైన, సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది’ అని అన్నారు. ఓ సమస్య పరిష్కారంలో న్యాయస్థానం తీర్పులు ఏభై ఏళ్లయినా వందేళ్లయినా అదే విధంగా ఉంటాయని, కానీ మనసుల కలయిక ద్వారా, హృదయాలను చేరువచేయడం ద్వారా చర్చలు జరిపి సాధించే పరిష్కారాలు పదికాలాల పాటు గుర్తుండిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాను వౌలానా ఖాలీద్ రషీద్, పరంగీ మహిళీ సహా అనేక మంది ముస్లిం నేతలతో మాట్లాడానని పేర్కొన్న ఆయన వీరంతాకూడా హిందూ, ముస్లింల మధ్య సయోధ్య వారధిని నిర్మించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ ముస్లిం వర్గాలు శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నాయని వీరి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదని వారు స్పష్టం చేశారని ఆయన తెలిపారు. ‘అయితే ఈ బంధం మరింత బలపడడానికి సుహృద్భావ వాతావరణాన్ని, సయోధ్యను తామంతా ఒకటేనన్న భావనను బలోపేతం చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు. కోర్టు నిర్ణయం వెలువడడానికి ముందే అయోధ్య సమస్యను మీరు పరిష్కరించాలని భావిస్తున్నారా? లేక ఆ తరువాత కూడా మీ ప్రయత్నాలు కొనసాగుతాయా? అన్న ప్రశ్నకు ‘మేం ఏ అవకాశాన్నీ వదులుకోదలచుకోలేదు. మేం ఎలాంటి అజెండా కోసం పనిచేయడం లేదు. ఓ జటిల సమస్యకు మార్గాంతరాన్ని అనే్వషిస్తున్నాం. అయితే మాకు కొంత వ్యవధి కావాలి. పరిష్కార ప్రయత్నాల విషయంలో ఏ విధంగానూ తొందర పడడం లేదు. అన్ని వర్గాలతోనూ చర్చిస్తాం. సుహృద్భావాన్ని కొనసాగిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పరింజీ మహిళి రెండు మతాల నేతలు నిర్ణీత కాల వ్యవధిలో సమావేశాలు కొనసాగిస్తే విభేదాలు పరిష్కారమవుతాయని అన్నారు.

చిత్రం..శుక్రవారం లక్నోలో ఈద్గా ఇమామ్ వౌలానా ఖాలిద్ రషీద్
ఫ్రాంగి మహాలితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రవిశంకర్