జాతీయ వార్తలు

సాక్షులను రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆశారాం బాపు లైంగిక వేధింపుల కేసులో ప్రత్యక్ష సాక్షులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో సాక్షులకు పటిష్ఠమైన భద్రత కల్పించేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రత్యక్ష సాక్షులకు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ సాక్షుల పరిరక్షణ కార్యక్రమాన్ని రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆశారాం బాపుపై నమోదయిన కేసుకు సంబంధించి దాఖలయిన ఒక రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశారాం బాపుపై నమోదయిన కేసులపై కింది కోర్టుల్లో విచారణ కొనసాగుతుండగానే, ఆ కేసుల్లోని సాక్షులకు కల్పించిన భద్రతను తగ్గించారని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తేవడంతో స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఆశారాం బాపు (ఆసుమల్ సిరుమలాని), అతని కుమారుడు నారాయణ్ సాయిలు తమ ఆశ్రమానికి వచ్చిన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదయిన కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకె సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. వివాదాస్పద మత గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గత నాలుగేళ్లుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆశారాం బాపుపై దాఖలయిన కేసుల్లో కొంత మంది ప్రత్యక్ష సాక్షులు హత్యకు గురికావడం, మరికొంత మంది అదృశ్యమైన నేపథ్యంలో మిగతా అనేక మంది సాక్షులు తమకు ప్రాణభయం ఉందని నిరుడు క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.