జాతీయ వార్తలు

గుజరాత్ ఎన్నికలకు భాజపా తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 17: వచ్చే నెలలో జరిగే గుజరాత్ శాసనసభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ 70 మంది అభ్యర్థులతో శుక్రవారం తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ టిక్కెట్లు పొందిన వారిలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీతూ వఘానీ ఉన్నారు. పటేల్ సామాజిక వర్గం నుంచి 18 మంది, ఓబీసీల నుంచి 16 మంది, ఎస్సీల నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి 11 మంది తొలి జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో బుధవారం భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో తొలి జాబితాను ఖరారు చేశారు. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. తొలిజాబితాలో 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి పార్టీ టిక్కెట్లు లభించగా, ముగ్గురు ఎమ్మెల్యేలను బరిలోనుంచి తప్పించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన అయిదుగురు మాజీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పశ్చిమ రాజ్‌కోట్ నుంచి, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహ్సానా నుంచి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వఘానీ పశ్చిమ భావ్‌నగర్ నుంచి పోటీ చేస్తారు. రూపానీ మంత్రివర్గంలో ఉన్న 25 మంది మంత్రుల్లో 15 మంది మాత్రమే తొలిజాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇటీవలే పోలీసు శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ ఐపిఎస్ అధికారి పీసీ బరండాకు భిలోడ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ లభించింది. రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న పటేల్ వర్గంపై పోరాడుతున్న ఓబీసీలకు తొలి జాబితాలో 16 టిక్కెట్లు దక్కాయి.
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు రాఘవ్‌జీ పటేల్, ధర్మేంద్రసింగ్ జడేజా, సీకే రౌల్జీ, మాన్‌సింగ్ చౌహాన్, రామ్‌సింగ్ పర్మార్ టిక్కెట్లు లభించాయి. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే భోలాభాయ్ గోహెల్‌కు మాత్రం నిరాశే మిగిలింది. అయితే, భోలాభాయ్ సూచించిన భరత్‌భాయ్ బోగ్రాను జస్దాన్ నియోజకవర్గానికి ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావనా మక్వానా, వర్షా జోషీ, నలిన్ కొటాడియాలకు టిక్కెట్లు లభించలేదు.
లతీ నియోజకవర్గం ఎమ్మెల్యే బావ్‌కూ ఉంధాద్‌ను ఈసారి ఆమ్రేలి నుంచి బరిలోకి దింపాలని, మాజీ ఎంపీ దిలీప్ సంఘానీని ధారి అసెంబ్లీ స్థానం నుంచి నిలపాలని నిర్ణయించారు. 2012లో గెలిచిన ఓ స్వతంత్ర అభ్యర్థికి ఈసారి భాజపా టిక్కెట్ లభించింది. తొలిజాబితాలో నలుగురు మహిళలు ఉన్నారని, కొద్దిరోజుల్లోనే రెండో జాబితాను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ చెప్పారు. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వరుస పర్యటనలతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తున్నా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటనలు వెలువడడం లేదు.