జాతీయ వార్తలు

సైనిక శక్తిని మరింత పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా) అమలును ఎత్తివేయాలని అనేక వర్గాలు డిమాండ్ చేస్తున్న సమయంలో అమెరికాకు చెందిన పేవ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న 60 శాతానికి పైగా మంది మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరిన్ని బలగాలను మోహరించాలని అభిప్రాయపడటం విశేషం. జమ్మూకాశ్మీర్‌లోని వివాదాస్పద సరిహద్దుల విషయానికి వచ్చేసరికి భారత ప్రజలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం మరింత సైనిక శక్తిని ఉపయోగించాలని సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది అభిప్రాయపడ్డారని పేవ్ రీసెర్చ్ సెంటర్ శుక్రవారం తెలిపింది. అయితే కొంత మంది మాత్రం ప్రభుత్వం తక్కువ సైనిక శక్తిని ఉపయోగించాలని లేదా ఇప్పుడు ఉపయోగిస్తున్న సైనిక శక్తికి సమానంగానే ఉపయోగించాలని సూచించారని పేవ్ సర్వే నివేదిక వెల్లడించింది. భద్రతా బలగాలు నిరుడు జూలైలో హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వనీని హతమార్చినప్పటి నుంచి రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి భద్రతా బలగాలకు, పౌరులకు మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్ పట్ల భారత ప్రజల వ్యతిరేకత పెరుగుతోందని పేవ్ రీసెర్చ్ సర్వేల్లో తేలింది. భారత ప్రజల్లో నిరుడు 55 శాతం మంది పాకిస్తాన్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయగా, ఆ సంఖ్య ఈ ఏడాది 64 శాతానికి పెరిగిందని పేవ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఈ సర్వేలో భాగంగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 2,464 మంది అభిప్రాయాలను సేకరించారు.