జాతీయ వార్తలు

‘రాఫెల్’పై విమర్శలు సిగ్గుచేటు: రక్షణ మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై విమర్శలకు దిగడం సిగ్గుచేటని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కువిమర్శలు గుప్పించడం అంటే రక్షణ దళాల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు వ్యవహారంలో వ్యాపారవేత్తనుంచి లబ్ది పొందడానికి ప్రధాని మోదీ ఒప్పందానే్న మార్చేశారంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై రక్షణ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒప్పందాలు పారదర్శకంగా సాగాయన్న విషయం అందరికీ తెలుసు. అయినా విమర్శలు గుప్పించటం బాధాకరం. ఈ విమర్శలు వాళ్ల మానసిక పరిపక్వతను స్పష్టం చేస్తున్నాయి’ అంటూ మీడియా వద్ద వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లోవున్న ఒప్పందాలను ఆగమేఘాలమీద కుదుర్చుకోవడానికి కారణం, భారతీయ వాయుసేనకు వాటి అవసరాన్ని గుర్తించడమేనని వివరించారు. భారత్- ఫ్రాన్స్‌ల మధ్య సుదీర్ఘంగా ఐదు దఫాల చర్చలు జరిగిన తరువాతే 36 రాఫెల్ జెట్స్ కొనుగోలుపై 2016 సెప్టెంబర్‌లో రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒక అంగీకారానికి వచ్చిందన్నారు.