జాతీయ వార్తలు

తేజస్వి, రబ్రీలకు మళ్లీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లకు శుక్రవారం మళ్లీ సమన్లు జారీ చేసింది. యూపీఏ-1 హయాంలో రైల్వే హోటళ్ల కేటాయింపు అవినీతి కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ దర్యాప్తు జరుపుతోందని అధికార వర్గాలు శుక్రవారం ఇక్కడ చెప్పాయి. నవంబర్ 20వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ తేజస్వికి, నవంబర్ 24న విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీదేవికి సమన్లు జారీ చేసినట్టు ఆ వర్గాలు వివరించాయి. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్విని ఈడీ ఈ కేసులో చివరిసారి నవంబర్ 13న రెండోసారి విచారించింది. ఈడీ ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రబ్రీదేవి విచారణకు హాజరు కాలేదు.