జాతీయ వార్తలు

ఆ చట్టాలను రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: దేశంలో గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. కొన్ని చట్టాలను గోరక్షకులు తమ చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడుతున్నారని పౌర హక్కుల నేత తీస్తా సెతల్వాద్ ఆరోపించారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చేసుకుని గోరక్షకుల ఆగడాలను అదుపుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాంటి చట్టాలను రద్దుచేయాలని ఆమె కోరారు. టాటా లిటరేచర్ లైవ్‌లో జరిగిన ఓ సమావేశంలో సెతల్వాద్‌తోపాటు నరేష్ ఫెర్నాండెజ్ (ఎడిటర్ స్క్రోల్.ఇన్), థామస్ బ్లోమ్ హేన్‌సన్ (ప్రొఫెసర్, స్టాన్‌ఫర్డ్ వర్శిటీ) ప్రసంగించారు. మహారాష్టత్రో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో గోరక్షణ కోసం రూపొందించిన చట్టాలు గోరక్షకులకు అనుకూలంగా పరిణమించాయని వారు ఆరోపించారు. ఏ ఉద్దేశంతో వాటిని రూపొందించారో అది నెరవేరకుండా కొందరి చేతులోకి వెళ్లి దుర్వినియోగమవుతున్నాయని వక్తలు ధ్వజమెత్తారు. గోరక్షకులు వాటిని ఆసరా చేసుకుని అమాయకులపై దాడులకు దిగుతున్నారని సెతల్వాద్ విరుచుకుపడ్డారు. అలాంటి చట్టాలను రద్దుచేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఆమె వెల్లడించారు. చట్టాలు యధేచ్ఛగా దుర్వినియోగం అవుతున్నా ప్రతిపక్షాలు వౌనం వహించడం దారుణమని అన్నారు. సమాజంలో కొందరు గోవులను పవిత్రంగా భావిస్తారని అలాగని వాటికి నష్టం జరిగిందన్న కారణంతో అమాయకులపై దాడులు చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని వక్తలు స్పష్టం చేశారు. అమాయకులపై దాడులు జరుగుతున్నప్పటికీ సమాజం వౌనం వహించడం బాధాకరమని ఆమె అన్నారు.