జాతీయ వార్తలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ రేపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును ఆమోదించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సోమవారం సమావేశం కానుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం మొదలవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారని భావిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అధ్యక్ష ఎన్నికల షెడ్యూలును సీడబ్ల్యూసీ ఆమోదించాక,
పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆ షెడ్యూలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మొదలు కావడానికి ముందే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల షెడ్యూలుకు సీడబ్ల్యూసీ ఆమోదం అవసరం లేనప్పటికీ, దాని ఆమోదం తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు డిసెంబర్ 31లోపు పూర్తి కావలసి ఉంది. ఈ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయడానికి చివరి గడువును ఈ సంవత్సరం డిసెంబర్ 31గా ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే.