జాతీయ వార్తలు

కాంగ్రెస్ గెలుపునకు రాహుల్ కఠోర దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి, నవంబర్ 18: హిమచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కఠోర దీక్షతో పనిచేస్తున్నారని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గెలుపు తథ్యమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎర్నాకుళంలోని సెయింట్ థెరెసా కళాశాలలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వచ్చిన సందర్భంగా మన్మోహన్ విలేఖరులతో మాట్లాడారు. హిమాచల్, గుజరాత్‌లో కాంగ్రెస్ విజయావకాశాల గురించి మీడియా ప్రశ్నించగా, ‘రాహుల్ బాగా కష్టపడుతున్నారు.. ఆయన కష్టం ఫలితంగా మా పార్టీకి గెలుపు కిరీటం దక్కుతుందని భావిస్తున్నా.. అయితే రాజకీయాల్లో దేనినీ స్పష్టంగా అంచనా వేయలేం..’ అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేసిన నోట్లరద్దు, జీఎస్టీ విధానం వల్ల ప్రజల్లో ఆగ్రహం ఉందని, అయితే దాని పర్యవసానాలు ఎన్నికల సమయంలో ఎలా ఉంటాయో చెప్పడానికి తాను ప్రవక్తను కానని అన్నారు. ‘నాలో ఆశ మాత్రం ఉంది.. ఏది కచ్చితంగా జరుగుతుందో చెప్పలేను..’ అని మాజీ ప్రధాని అన్నారు.
వామపక్షాలు సహకరించాలి
భాజపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు సహకరించాలని మన్మోహన్ సింగ్ కోరారు. జాతీయ స్థాయిలో తాము భాజపా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కోచిలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన అన్నారు. కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ‘చట్టాలను ఖాతరు చేయడం లేదు.. మహిళలకు భద్రత లేదు.. ఆర్థిక ప్రగతి నీరసపడింది..’ అంటూ కేరళ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.