జాతీయ వార్తలు

ఆయన బీజేపీ బంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలియా (యూపీ), నవంబర్ 18: వివాదాస్పద అయోధ్య సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం నెరపుతానంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న ప్రకటనలను సమాజ్‌వాదీ పార్టీ ఎద్దేవా చేసింది. హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలన్న కుట్రలో భాగమే రవిశంకర్‌ను రంగంలోకి దించారని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామశంకర్ విద్యార్థి విమర్శించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసు డిసెంబర్ 5నుంచి సుప్రీం కోర్టులో విచారణకు రానున్న దశలో ఇప్పుడు మధ్యవర్తిత్వం అంటూ కొత్త నాటకానికి తెరతీశారని ఆయన ధ్వజమెత్తారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ బీజేపీ బంటు. ప్రజల వద్ద ఇలాంటి గారడీవిద్యలు పనిచేయవు’ అని విద్యార్థి స్పష్టం చేశారు. హిందూ ఓటు బ్యాంకుపై కనే్నసిన కమలనాథులు ఆధ్యాత్మిక గురువును రంగంలోకి దించారని ఎస్‌పి నేత తీవ్ర ఆరోపణ చేశారు. న్యాయస్థానం తీర్పులకన్నా పరస్పర అవగాహనతో ఓ ఒడంబడిక చేసుకోవచ్చని చెప్పే అధికారం రవిశంకర్‌కు ఎక్కడిదని ఆయన నిలదీశారు. అసలు మధ్యవర్తిత్వం చేయమని ఆయనను ఎవరు అడిగారని ఎస్‌పి ప్రశ్నించింది. వివాదాస్పద విషయంలో జోక్యం చేసుకోవడమేకాకుండా ముస్లింపెద్దలతో సంప్రదింపులు జరపడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చీఫ్ రవిశంకర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్య పరిష్కరించుకుంటే పదికాలాల పాటు ఉంటుందన్న ఆయన ప్రకటించిన వెంటనే సమాజ్‌వాదీ పార్టీ స్పందించింది. బీజేపీకి రవిశంకర్ నమ్మిన బంటు అంటూ ధ్వజమెత్తింది.