జాతీయ వార్తలు

రుణాలను మాఫీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20, 21 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ శనివారం తెలిపింది. ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న 180 రైతు సంఘాల ప్రతినిధులు హాజరవుతారని కమిటీ అధ్యక్షుడు అశోక్ ధవాలే వెల్లడించారు. పంట ఉత్పత్తికి ఎంత ఖర్చయిందో, దానికి యాభై శాతం కలుపుకుని గిట్టుబాటు ధర నిర్ణయాలన్నది తమ ప్రధానమైన డిమాండ్ ఆయన చెప్పారు. అలాగే రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేయాలని డిమాండ్ చేశారు. తనను గెలిపిస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తానని ఎన్నికల సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని ఇప్పటికీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. పంటల ఉత్పత్తి వ్యయం, ఇంధన చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, పురుగు మందులు, ఎరువులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయని, యాతావాతా రైతులు ఈ ఖర్చులను భరించలేకపోతున్నారని వివరించారు. ఖర్చులు పెరిగిపోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని అన్నారు. దాని పర్యవసానమే రైతుల ఆత్మహత్యలని అశోక్ ధవాలే పేర్కొన్నారు. ‘కిసాన్ ముక్తి సంసద్’ పేరుతో తాము నిర్వహించిన తలపెట్టిన ఆందోళనా కార్యక్రమాలకు రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.