జాతీయ వార్తలు

ఫరూఖ్, రిషి కపూర్‌లపై దేశద్రోహం కేసు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, నవంబర్ 18: ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ (పీవోకే)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, సినీ నటుడు రిషికపూర్‌లపై ‘దేశద్రోహ నేరం’ కింద కేసులు నమోదు చేయాలని సుకేశ్ ఖజూరియా అనే సామాజిక కార్యకర్త ఇక్కడి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటిజన్స్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా గతంలో పనిచేసిన ఖజూరియా.. అబ్దుల్లా, రిషిలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ‘పీవోకే’ పాకిస్తాన్‌కే చెందుతుందని కొద్ది రోజుల క్రితం ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సీఆర్‌పీసీలోని సెక్షన్ 196కు విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో వివరించారు. ‘రన్‌బీర్ పీనల్ కోడ్’ (రాజద్రోహం)లోని సెక్షన్ 124-ఏ ప్రకారం ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేయాలన్నారు. ‘పీవోకే’ పాకిస్తాన్‌కే చెందుతుందన్న వాదనలో ఎలాంటి మార్పు లేదని, ఇందుకు భారత్, పాక్ ఎన్నాళ్లు యుద్ధం చేయాలని ఫరూఖ్ అబ్దుల్లా ఈ నెల 11న అన్నారు. అబ్దుల్లా వ్యాఖ్యలను సమర్థించినందుకు బాలీవుడ్ నటుడు రిషి కపూర్‌పైనా కేసులు నమోదు చేయాలని ఖజూరియా ఫిర్యాదు చేశారు.