జాతీయ వార్తలు

స్వామి పిటిషన్‌ను కొట్టేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: నేషనల్ హెరాల్డ్ కేసుతో తీర్పు రాకుండా పిటిషనర్, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సోనియా, రాహుల్‌తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలపై స్వామి అవినీతి ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై ఆరోపణలు చేస్తూ బిజెపి నేత దాఖలు చేసిన దరఖాస్తును విచారించవద్దంటూ కాంగ్రెస్ నేతలు కోర్టును అభ్యర్థించారు. స్వామి పిటిషన్‌పై కోర్టు నుంచి అందుకున్న సమన్లకు బదులిచ్చారు. పిటిషనర్ తీరుపై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అంబికా సింగ్‌కు వివరణ ఇచ్చారు. కోర్టు తిరస్కరిస్తున్నప్పటికీ సాక్షాలంటూ అదేపనిగా పిటిషన్లు వేయడం వేధనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకసారి దరఖాస్తు చేయడం, దాన్ని ఉపసంహరించుకోవడం, కోర్టు తిరస్కరించడం, ముందు వాటిని మార్చి మళ్లీ దాఖలు చేస్తున్నారు. దీనివల్ల కోర్టు విలువైన సమయం వృధా అవుతోంది. అంతేకాక జుడీషియల్ ప్రక్రియంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది’ అని కోర్టుకు స్పష్టం చేశారు. బిజెపి నేత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సోనియా, రాహుల్ అభ్యర్థించారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి నిధులు దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహల్‌తోపాటు నలుగురు కాంగ్రెస్ నేతలపై సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టారు. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిధులు స్వాహా అయ్యాయని ఆయన ఆరోపించారు. దీనిపై ఏకంగా 450 పేజీలతో కూడిన డాక్యుమెంట్లు కోర్టును అందజేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు అందజేసి కేసు విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. తమపై వచ్చిన ఆరోపణలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్‌పిట్రోడా ఖండించారు. 2014 జనవరి 26న కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. 2015 డిసెంబర్ 19న సోనియా, రాహుల్, వోరా, ఫెర్నాండెజ్, దూబేకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పిట్రోడాకు 2016 ఫిబ్రవరి 20న కోర్టుకు హాజరై బెయిల్ పొందారు.