జాతీయ వార్తలు

మా అక్కకు రక్షణే లేదు: శశికళ సోదరుడి ఆవేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్నార్‌గుడి, నవంబర్ 19: దాదాపు 20ఏళ్లపాటు జయలలితకు చేదోడువాదోడుగా ఉండి అన్ని విధాలుగా ఆమెకు సహరించిన శశికళకు రక్షణ లేకుండా పోయిందని ఆమె సోదరుడు వి దివాకరన్ ఆవేదన వ్యక్తం చేశారు. శశికళ ఇళ్లపై ఆదాయం పన్ను దాడులు జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన ఆయన ‘నా సోదరికి జయలలిత ఏరకంగానూ రక్షణ కల్పించకుండా వెళ్లిపోయారు’ అని అన్నారు. 1996 నుంచీ శశికళపై ఏదో ఒక రకమైన దర్యాప్తు జరుగుతూనే ఉందన్నారు. ఆ ఏడాది జయలలిత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిపోయారని, ఆమెతోపాటు శశికళపైనా అవినీతి ఆరోపణలు తలెత్తాయని దివాకరన్ అన్నారు. జయలలిత తన సోదరికి అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో ఉపయోగించుకుందని, ఆమెకంటూ ఏ రక్షణనూ ఇవ్వకుండా వెళ్లిపోయిందని దివాకరన్ అన్నారు.