జాతీయ వార్తలు

‘పద్మావతి’కి దావూద్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 19: ‘పద్మావతి’ సినిమా వాయిదా నిర్ణయం ప్రజల్ని మోసగించే ప్రయత్నమేనని రాజ్‌పుత్ కర్ణిసేన నాయకుడు లోకేంద్ర సింగ్ కల్వి స్పష్టంచేశారు. ఈ సినిమా నిర్మాణానికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి రహస్యంగా నిధులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్నందుకు తనకు కరాచీనుంచి బెదిరింపు ఫోన్లు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల కొన్ని రోజులు మాత్రమే వాయిదా పడిందని ఇది కూడా వ్యూహంలో భాగమేనన్నారు.
కాగా, తాజా వివాదాల నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. తాము స్వచ్ఛందంగానే డిసెంబర్ 1న విడుదల కావాల్సిన చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ఆ సంస్థ ప్రతినిథి వెల్లడించారు.
సెన్సార్ బోర్డు సహా దేశ రాజ్యాంగ వ్యవస్థలు, చట్టం పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తరువాతే చిత్రం విడుదలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు నెలకొనగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలావుండగా హర్యానాకు చెందిన బిజెపి నేత పద్మావతి సినిమాపై మరో తీవ్రమైన ప్రకటన చేశారు. ఇందులో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, దర్శకుడు భన్సాలీల తల నరికితే పదికోట్లు ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటికే దీపికా, భన్సాలీల తలలకు ఐదు కోట్ల రేటు కట్టినందుకు మీరట్‌కు చెందిన యువతను తాను అభినందిస్తున్నానని బిజెపి నాయకుడు సూరజ్ పాల్ ఆము వెల్లడించారు.