జాతీయ వార్తలు

71మందితో కాంగ్రెస్ తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 19: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు కాంగ్రెస్ తొలిజాబితా విడుదలైంది. ఇప్పటికే బిజెపి వందకు పైగా తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పార్టీ కుమ్ములాటలు, మిత్రపక్షాల సీట్ల డిమాండ్ల మధ్య ఆదివారం పొద్దుపోయాక కాంగ్రెస్ తన తొలి జాబితాను 71 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్న రీతిని తలపిస్తున్నాయి. తొలి దశ ఎన్నికల నామినేషన్ల గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ హడావుడిగానే ఈ జాబితాను ఖరారు చేసినట్టు చెబుతున్నారు. హార్థిక్ పటేల్ సారధ్యంలోని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి పెడుతున్న మెలికల కారణంగానే తొలి జాబితా ఖరారు జాప్యం జరిగినట్టుగా తెలుస్తోంది. తమకు 20 స్థానాలు కేటాయించాలని ఇప్పటికే ఈ సమితి డిమాండ్ చేసింది. అలాగే, అల్పేష్ ఠాకూర్ సారథ్యంలోని ఓబీసీ గ్రూపు 12 స్థానాలను డిమాండ్ చేస్తోంది. వీటికితోడు రాష్ట్ర కాంగ్రెస్ విభాగంలో చీలికలు, పరస్పర ఆధిపత్యం కూడా అభ్యర్థుల ఎంపికలో గుదిబండగా మారినట్టు చెబుతున్నారు. 182 స్థానాలకు సంబంధించి 106 మంది అభ్యర్థుల పేర్లను బిజెపి ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలకుగాను తొలివిడత పోలింగ్ డిసెంబర్ 9న, మరో 93 స్థానాలకు డిసెంబర్ 14న ఎన్నికలు జరుగుతాయి.

చిత్రం..అహ్మదాబాద్ సమీపంలోని మాన్స వద్ద నిర్వహించిన
అధికార్ సమ్మేళన్‌లో మాట్లాడుతున్న హార్దిక్ పటేల్