జాతీయ వార్తలు

లౌకికవాదమే ఇందిర ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చివరి శ్వాస వరకూ లౌకికవాద పరిరక్షణ కోసమే పాటుపడ్డారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. భారతీయులందరూ ఒక్కటేనన్నదే ఆమె మతం, అభిమతమని సోనియా స్పష్టం చేశారు. కుల, మత పాత్రిపదికన భారత్‌ను ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నించిన శక్తులను ఎదురొడ్డి సమైక్య భారతావనిని ఇందిరాగాంధీ కాపాడారని, ఆందుకే ఆమె దేశానికి చెందిన అత్యంత ఉన్నతమైన నాయకురాలని సోనియా అభివర్ణించారు. దేశ ప్రధానిగా భారతీయులందరిదీ ఒక్కటే మతం అన్న సమున్నత భావనతోనే ఇందిర అహరహం శ్రమించారని ఇందిర జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా అన్నారు. రాజకీయ పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇందిర ఎప్పుడూ ఆశపడలేదని, చివరి వరకూ నమ్ముకున్న సిద్ధాంతాల కోసమే పని చేశారని, సంకుచిత ప్రయోజనాలకు దూరంగానే విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారని సోనియా అన్నారు. భారత దేశ భిన్న వైవిధ్యాన్ని ఇందిర పరరిక్షించారని, దేశ ప్రజాస్వామ్య లౌకిక విలువలను కూడా బలోపేతం చేశారన్నారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అము చేశారని, వారి హక్కులను కాపాడేందుకు చివరి క్షణం వరకూ ప్రయత్నించారని సోనియా తెలిపారు. అందుకే భారతదేశ ఉక్కు మహిళగానూ ఇందిర ఘనతను సాధించారని సోనియా పేర్కొన్నారు. నిర్ణయాలను అమలు చేయడంలో ఉక్కు మహిళగా ముందుకు దూసుకెళ్లిన ఇందిర, మానవత్వ విలువల కోసం శ్రమించారని అన్నారు. ఏకరంగానూ అణచివేత చర్యలను ఇందిర క్షమించలేదని, నిష్పాక్షికతతోనే నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజలందరి అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ప్రత్యేక సంపుటిని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. ‘్ధరోదాత్త జీవితం’ అన్న శీర్షిక ఆధారంగా ఓ కార్యక్రమాన్నీ ఈ సందర్భంగా నిర్వహించారు. పదహారేళ్లపాటు ఇందిర దేశాన్ని పాలించారని, ఆ కాలంలో ఆమె సాధించిన విజయాలనూ ఈ సందర్భంగా ప్రదర్శించారు.
శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి అంశాల్లో విశేషంగా కృషి చేసిన వారికిచ్చే ఇందిరా గాంధీ పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ అందుకోబోతున్నారు. 2004నుంచి 14వరకూ భారత దేశ ఖ్యాతిని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఇనుమడింప చేసినందుకుగానీ ఈ ఏడాది మన్మోహన్‌ను ఇందిర జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈమేరకు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలోని అంతర్జాతీయ జ్యూరీ అనేకమంది పేర్లను పరిశీలించిన మీదట మన్మోహన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ట్రస్ట్ ప్రకటించింది. భారత దేశ ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ఖ్యాతిని పెంపొందించడంలోనూ, అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను ఇనుమడింప చేయడంలోనూ మన్మోహన్ విశేషమైన కృషి చేశారని ఆప్రకటనలో పేర్కొంది.

చిత్రాలు..మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ఆమె స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించేందుకు వస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తదితరులు.
* పార్లమెంటు హౌలో నిర్వహించిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ తదితరులు.