జాతీయ వార్తలు

ఇళ్ల స్థలాల కేసు జనవరి 16కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే జనవరి 16వ తేదీకి వాయిదా పండింది. ఇళ్ల స్థలాల కేటాయింపులపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్లపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషాన్ కౌల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఇళ్ల స్థలాల కేటాయింపులపై తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశాయి. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మూడు వారాలలోపు అభిప్రాయాలను సమర్పించాలని ఆదేశించింది. లేకుంటే ఆయా ప్రభుత్వాలను కేసు విచారణ నుంచి పక్కన పెడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, సివిల్ సర్వీసు ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అభిప్రాయాలను వెల్లడించిన అనంతరం కేంద్రం దీనిపై మరో మూడు వారాలలోగా నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 16కు వాయిదా వేసింది.