జాతీయ వార్తలు

రచయిత జావెద్ అఖ్తర్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 21: దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావతి’ హిందీ చలనచిత్రానికి సంబంధించి వివాదాలు, కోర్టు కేసులకు అంతేలేకుండా పోతోంది. రాజపుత్రులను అవమానించారని కొందరు ఫిర్యాదు చేయడంతో సినీగీత రచయిత జావెద్ అఖ్తర్‌పై జైపూర్‌లోని సింధీ క్యాంప్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజపుత్రులు 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులతో ఏనాడూ యుద్ధం చేయలేదని అఖ్తర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఇలా మాట్లాడడం రాజపుత్రులను అవమానపరచడమేనని పోలీసులకు ఫిర్యాదు అందింది. ‘పద్మావతి’పై తన వాదనను దర్శకుడు భన్సాలీ సోమవారం మీడియాకు వివరించినపుడు, ఈ సినిమాకు గీత రచయిత, స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేసిన జావెద్ అఖ్తర్ మాట్లాడుతూ రాజపుత్రులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని రాణాలు, రాజాలు, మహారాజులు, రాజపుత్రులు బ్రిటిష్ వారి కోర్టులలో 200 ఏళ్లపాటు సేవలందించారే తప్ప ఏనాడూ పరాయి పాలకులతో యుద్ధం చేయలేదని అఖ్తర్ వ్యాఖ్యానించారు. ‘పద్మావతి’ సినిమాను వ్యతిరేకిస్తున్న వారిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాజపుత్ కర్ణిసేన అధ్యక్షుడు మహీపాల్ సింగ్ మక్రానా, మరికొందరు రాజ్‌పుత్ సామాజిక వర్గం నాయకులు అఖ్తర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.