జాతీయ వార్తలు

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 21: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేయాలని రెండు ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉన్న 184 రైతు సంఘాలు ఢిల్లీలో రెండోరోజూ వేలాది మంది రైతులతో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రైతు విముక్తి పార్లమెంట్‌లో ఆమోదించిన రైతు విముక్తి బిల్లు, కనీస మద్దతు ధర బిల్లుపై దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి వచ్చే యేడాది జనవరి 26 వరకు రెండు నెలలపాటు ప్రచారం చేయాలని నిర్ణయించాయి. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసినట్టుగానే అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఐక్య వేదికలు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు తీర్మానం చేశాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతన్నలు తమ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విత్తనాలు, యంత్ర పరికరాలకోసం విదేశీ కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారని విమర్శించారు.

చిత్రం..ఢిల్లీలో నిర్వహించిన రైతుల ధర్నాలో స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, సామాజిక కార్యకర్త మేథా పాట్కర్