జాతీయ వార్తలు

తపాల శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: తెలుగు రాష్ట్రాల్లో 2010-16 మధ్యకాలంలో తపాల శాఖలో గ్రామీణ్ డాక్ సేవక్ (జీడిఎస్) విభాగంలో కారుణ్య నియామకానికి అర్హత ఉండి తిరస్కరణకు గురైనవారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని పోస్టల్ శాఖలో పనిచేసినవారి కుంటుబ సభ్యులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కుటుంబ సభ్యులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా, పోస్టల్ ఉన్నతాధికారులను కలిశారు. గతంలో పోస్టల్ శాఖ జారీచేసిన జీవో వలన తాము తీవ్రంగా అన్యాయానికి గురయ్యామని, తమకు కూడా సవరించిన నూతన జీవో వర్తింపజేసి కారుణ్య నియామకాలు చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.