జాతీయ వార్తలు

15నుంచి పార్లమెంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే
ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లుకు కేంద్రం కసరత్తు
శీతాకాల సమావేశాల వాయిదాను సమర్థించుకున్న బీజేపీ
న్యూఢిల్లీ, నవంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ పదిహేనో తేదీనుండి జనవరి ఐదోతేదీ వరకు నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం యోచిస్తోంది. గుజరాత్ శాసనసభ రెండో విడత పోలింగ్ డిసెంబర్ 14వ తేదీన ముగుస్తుంది. డిసెంబర్ 15 శుక్రవారం అవుతోంది. సమావేశాలు శుక్రవారం ప్రారంభమైనా మొదటి రోజు ప్రస్తుత సభ్యులతోపాటు మాజీ సభ్యుల మరణం పట్ల సంతాపం తెలిపిన అనంతరం సభ వాయిదా పడటం ఖాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల సీట్లు పెంచేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించే సూచనలేవీ కనిపించటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభా ముఖంగా అసెంబ్లీ సీట్లు పెంచాలని డిమాండ్ చేయటం తెలిసిందే. ఏపీ విభజన చట్టంలో ఈ మేరకు ఇచ్చిన హామీని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఏపీ శాసన సభ సీట్లు పెంచాలని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి అసెంబ్లీ సీట్లు పెంచటం గురించి చంద్రబాబు చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో టెలిఫోన్‌లో మాట్లాడి అసెంబ్లీ సీట్ల పెంపకం గురించి వాకబు చేశారు. అయితే అమిత్ షా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రులిద్దరూ ఎంతగా డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచే అంశంపై ఎలాంటి చొరవ చూపించటం లేదు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు సంబందించిన ముసాయిదా బిల్లును ఈ సమావేశాల్లో ప్రతిపాదించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ముసాయిదా బిల్లు తయారవుతున్నట్లు న్యాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలను నవంబర్‌కు బదులు డిసెంబర్‌లో జరపటాన్ని బీజేపీ మంత్రులు సమర్థించుకుంటున్నారు. గతంలో రెండు మూడుసార్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్‌కు బదులు డిసెంబర్‌లో జరిగాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, చంద్రశేఖర్ హయాంలో ఇలా జరిగిందన్నారు. రాష్ట్రాల శాసనసభలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు జరగటం మంచిది కాదనే అభిప్రాయంతోనే రెండుసార్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలను క్రిస్మస్ తరువాత జరిపారని ఆయన వివరించారు.