జాతీయ వార్తలు

బాబ్రీ కూల్చివేతకు పాతికేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసి వచ్చేనెల 6వ తేదీ నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఉద్దేశ పూర్వకంగానే బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ (ఎం), సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఎఎల్‌ఎఫ్‌బీ, సిపిఐ (ఎంఎల్), ఎస్‌యుసీఐ (సీ) పార్టీలు బుధవారం ప్రకటించాయి. మతం పేరిట జనంలో చీలిక తెచ్చేందుకు కేంద్రంలోను, కొన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వామపక్ష పార్టీలు ఓ ప్రకటనలో తెలిపాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సర్కారు అధికారంలో ఉండగా అధికారులు, చట్టపరిరక్షకుల సాక్షిగా బాబ్రీ మసీదు కూల్చివేత అనే ‘అమాయక చర్య’ జరిగిందని వామపక్షాలు వ్యాఖ్యానించాయి. ‘లౌకికవాద, ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి ఇది’ అని ఆ పార్టీలు అభివర్ణించాయి. చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఆరెస్సెస్, బీజేపీకి చెందిన ‘ప్రైవేటు సైన్యాలు’ నేడు దేశంలో చెలరేగి పోతున్నాయని, గోసంరక్షణ ముసుగులో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆ ప్రకటనలో ఆరోపించారు. యువత ఏది తినాలో, ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించడానికి ‘మోరల్ పోలీసింగ్ స్క్వాడ్లు’ పనిచేయడం దారుణమన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలని ప్రయత్నిస్తూ, దానికి మతం రంగు పులమడం సహించరాని విషయమని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. డిసెంబర్ 6న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని కూడా నిర్వహించి, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తం చేస్తామని ఆ పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి.