జాతీయ వార్తలు

బ్రహ్మాస్త్రం.. బ్రహ్మోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం ఆనందమవగ
చందంగా బౌద్ధికతయు విందేజేయన్
పందెం గెలిచెను మానుషి
చిందేసెను దేశమంత వందేయనుచున్!

న్యూఢిల్లీ, నవంబర్ 22: భారత రక్షణశాఖలో ఓ మైలురాయిగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ విమానం నుంచి తొలిసారిగా ‘బ్రహ్మోస్’ను పరీక్షించినట్లు రక్షణ మంత్రి త్వ శాఖ బుధవారం ప్రకటించింది. రెండు దశల్లో చేపట్టిన ప్రయోగంలో బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’తో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ‘బ్రహ్మోస్ బృందాన్ని’, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివో) శాస్తవ్రేత్తలను అభినందించారు.
2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి ప్రయోగించవచ్చని నిరూపితమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 3,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది చేరుకుంటుంది. బ్రహ్మోస్ క్షిపణి పరీక్షతో భారత వాయుసేన శక్తిసామర్థ్యాలు మరింతగా పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఈ క్షిపణి పరీక్షను ‘బ్రహ్మోస్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధీర్ మిశ్రా, భారత వాయుసేన ఉన్నతాధికారులు, డిఆర్‌డివో శాస్తవ్రేత్తలు వీక్షించారు.