జాతీయ వార్తలు

అమెరికాతో బలపడనున్న బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు భారత్‌కు బాగా కలిసొచ్చేలా ఉంది. అమెరికాతో పలు అంశాల్లో ధృడమైన అనుబంధం పెరగడంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న అరమరికలు తగ్గి స్నేహబంధం పెరిగేందుకు తోడ్పడేలా ఈ సదస్సు ఒక వేదిక కాబోతోంది. ఇప్పటికే భారత్‌లో ఆర్ధిక అభివృద్ధి, సాంకేతిక రంగం, విద్యారంగం, రక్షణ రంగం, పురాతన వారసత్వ సంపద, సంస్కృతి తదితర రంగాల్లో కలిసి పనిచేసేందుకు అమెరికా ఉత్సాహంగా ఉండటం, భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేసేందుకు ఆసక్తి చూపడం శుభశూచకమని ఒక అధికారి పేర్కొన్నారు. శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ అనేక అంశాలపై ఈ నెల 28వ తేదీన చర్చించనున్నారు. ఇవాంక ట్రంప్ సైతం ప్రపంచంలో అతిపెద్దదైన విందు కార్యక్రమంలో తొలిసారి పాల్గొనబోతున్నారు. ఆ మాటకొస్తే ఇవాంక ఆసియా దేశాల పర్యటన కూడా ఇదే మొదటిసారి కావడంతో జీఈఎస్ సదస్సుపై ఆమె మరింత అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. మధ్య రెండు మార్లు ప్రధాని నరేంద్రమోదీకి ఆమె ట్వీట్ చేయడం, బదులుగా తాను సైతం ఆసక్తిగా ఉన్నట్టు ప్రధాని రీ ట్వీట్ చేయడంతో వీరిద్దరి సమావేశం మరింత కీలకం కాబోతోంది.

మార్క్ గ్రీన్ రాక

సదస్సులో పాల్గొనేందుకు 150 దేశాల నుండి 1500 మంది ప్రముఖులు హాజరవుతున్నా, అందరిలో మరో ఆకర్షణ మార్క్ గ్రీన్, యునైటెడ్ స్టేట్స్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌కు ఆయన అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. మార్క్ గ్రీన్ డిసెంబర్ 1 వరకూ హైదరాబాద్‌లో ఉంటారు. సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు ముంబైలో పలువురు సీనియర్ అధికారులతో కూడా సంభాషిస్తారు. యుఎస్ ఎయిడ్ సీనియర్ డిప్యుటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ కో ఆర్డినేటర్ , మిచ్చెలి బెక్కిరింగ్ కూడా మార్క్ గ్రీన్‌తో హైదరాబాద్ వస్తున్నారు. వీరిద్దరు మహిళా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. ఆయా దేశాల్లో ఆర్ధికాభివృద్ధికి మహిళల తోడ్పాటు ఎలా సాధించవచ్చో వారు చర్చిస్తారు. 2025 నాటికి టిబి లేని భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వారు స్వయంగా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా వివిధ ఆస్పత్రులను, నిర్వాహకులను కలుస్తారు. ముంబై వెళ్లి అక్కడ కూడా కొంత మంది అధికారులను కలుస్తారు.