జాతీయ వార్తలు

ఇప్పట్లో రాజకీయాల్లోకి రాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 23: ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న చర్చ కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘రాజకీయాల్లోకి రావడానికి ఇప్పుడు బలమైన అవసరం ఏదీ లేదు’ అని ఆయన గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఉత్తరాదిలో, దక్షిణాదిలో పెద్దసంఖ్యలో అభిమానులున్న రజనీ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారన్న ఊహాగానాలు ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో తన జన్మదినం అనంతరం అభిమానులతో, మద్దతుదారులతో సమావేశమవుతానని ఆయన తెలిపారు. డిసెంబర్ 12న జన్మదిన వేడుకల అనంతరం మద్దతుదారులతో అన్ని విషయాలూ మాట్లాడతానని వివరించారు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని దర్శించుకుని నగరానికి చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, ఇటీవల తన అభిమానులతో భేటీ అయిన సందర్భంగా ‘యుద్ధానికి సిద్ధం కండి’ అని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, రజనీ సహచర నటుడు కమల్ హసన్ కూడా ఇటీవల రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు గురించి ప్రకటిస్తానని కమల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చాక రజనీతో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని కమల్ హసన్ ప్రకటించారు. అయితే, ఈ ఇద్దరూ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదని చెబుతుండడం గమనార్హం.