జాతీయ వార్తలు

వాయుసేనలో తొలిసారిగా మహిళా పైలట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నూర్ (కేరళ), నవంబర్ 23: భారతీయ వాయుసేనలో తొలిసారిగా ఓ మహిళను పైలట్‌గా నియమించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్‌కు ఈ ఘనత దక్కింది. ఆమె సముద్రంపై నిఘా వేసే విమానంలో పైలట్‌గా సేవలందిస్తారు. అలాగే, వాయుసేనలోని ఆయుధాల తనిఖీ కేంద్రం (ఎన్‌ఏఐ)లో పనిచేసేందుకు తొలిసారిగా ముగ్గురు మహిళలను ఎంపిక చేయడం కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఢిల్లీకి చెందిన ఆస్తా సెగాల్, పుదుచ్చేరికి చెందిన రూప, కేరళ వాసి శక్తిమాయాలను ఎన్‌ఏఐలో మహిళా అధికారులుగా నియమించారు. కేరళలోని ఇజిమల నేవల్ అకాడమీలో సుభాంగి, ఆస్తా, రూప, శక్తిమాయా శిక్షణ పూర్తిచేశారు. ఇరవై ఏళ్లలోపు వయసు కలిగిన వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వాయుసేన నిర్ణయించింది. శిక్షణ ముగిసిన సందర్భంగా గురువారం జరిగిన కనులవిందుగా జరిగిన కార్యక్రమానికి భారత వాయుసేన అధిపతి అడ్మిరల్ సునీల్ లాన్‌బా హాజరయ్యారు. నేవల్ కమాండర్ కుమార్తె అయిన సుభాంగి తాను కూడా వాయుసేనలో పనిచేయాలని కలలుకని, అనుకున్నట్లే పైలట్‌గా నియామకం పొందారు. సుభాంగి తొలి పైలట్ అయినప్పటికీ, నేవీ ఏవియేషన్ విభాగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విధుల్లో ఇప్పటికే కొందరు మహిళలు పనిచేస్తున్నారని దక్షిణ ప్రాంత నేవీ అధికార ప్రతినిధి కమాండర్ శ్రీ్ధర్ తెలిపారు. వాయుసేనకు చెందిన ఆయుధాలు, పేలుడు సామగ్రి గణన, ఆడిటింగ్ వంటి పనులను ఎన్‌ఏఐలో చేపడతారు. వాయుసేన ఎంపిక చేసిన ఈ నలుగురు మహిళలకు సంబంధిత విభాగాల్లో శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సుభాంగి శిక్షణ పొందుతారు.