జాతీయ వార్తలు

సరిహద్దు ఇక శక్తిమంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: 73 రోజుల ‘డోక్లామ్’ ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా సరిహద్దులో తన దళాల తరలింపును వేగవంతం చేయాలని భారతీయ ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. సరిహద్దులోని రహదారులకు సంబంధించి వౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో ఇంజనీరింగ్ సిబ్బంది నిమగ్నం కాగా సైనిక దళాల తరలింపునకు ఆర్మీ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్వత ప్రాంతాల్లోను, రహదారుల్లోను అనువైన మార్పులు చేసేందుకు రంగంలోకి దిగారు. ఇందుకోసం భారీ యంత్రసామగ్రిని, వాహనాలను తరలిస్తున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. గనులను గుర్తించే వెయ్యి వాహనాలను సమకూర్చుకునేందుకు ఆర్మీ ముఖ్య కార్యాలయం రంగం సిద్ధం చేసింది. ఈ వాహనాల వల్ల ఇంజనీరింగ్ విభాగంలో గనులను గుర్తించే సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. సరిహద్దులోని ఉత్తరాన పర్వత ప్రాంతంలో ఇంజనీరింగ్ అధికారులు తమ పనులను ఇక మరింత వేగవంతం చేస్తారు. సరిహద్దు ప్రాంతంలో ప్రయాణించేందుకు అవసరమైన వౌలిక సౌకర్యాల కల్పనకు, తవ్వకాలను చేపట్టే వాహనాలను సమకూర్చుకునేందుకు ఆర్మీ ప్రాధాన్యం ఇస్తోంది. భారత్, చైనా దేశాలు సుమారు 4,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దును కలిగి ఉన్నాయి. భారతీయ ఆర్మీలో 237 ఏళ్ల చరిత్ర ఉన్న ‘కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్’ (సిఓఇ) విభాగం సరిహద్దులోని పర్వత ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో రహదారుల, సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సహకరిస్తోంది. సరిహద్దులో భద్రతా దళాల సంచారానికి, ఫిరంగులను చేరేవేసేందుకు వౌలిక సౌకర్యాలను సిఓఇ కల్పిస్తోంది. ఎత్తయిన పర్వత ప్రాంతాలపైకి చేరుకునేలా రహదారులను నిర్మించాలన్నది ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం వ్యూహం. ఇందుకోసం ‘బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ)ను బలోపేతం చేశారు. సరిహద్దులోని కీలక ప్రాంతాల్లో 73 రహదారులను నిర్మించాలని ‘బీఆర్‌ఓ’ను 2005లోనే ఆదేశించారు. అయితే, ఈ రహదారుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడం పట్ల ఆర్మీ అసంతృప్తితో ఉంది. సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో ఆర్మీ దళాలను అప్రమత్తంగాను, బలోపేతంగాను, సంసిద్ధంగాను ఉంచేందుకు ఇలాంటి వౌలిక సౌకర్యాలను కల్పించాల్సి ఉంది.
‘సిఓఇ’కి సంబంధించి తొలి విభాగాన్ని 1780 నవంబర్ 18న ప్రారంభించారు. వౌలిక వసతులను, వనరులను పెంచుకునేందుకు దృష్టి సారిస్తున్న భారతీయ ఆర్మీ డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో తన చర్యలను మరింత వేగవంతం చేసింది. చైనా సరిహద్దులో ఎలాంటి పరిణామాలనైనా దీటుగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలను సిద్ధం చేస్తోంది. సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని మన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘బల ప్రదర్శన’కు పదే పదే చైనా తెగిస్తున్నందున యుద్ధ వాతావరణం ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. డోక్లామ్ ప్రతిష్టంభన కారణంగా భారత, చైనా దళాలు సరిహద్దులో గత జూన్ 16 నుంచి మోహరించాయి. వివాదాస్పద స్థలంలో చైనా ఆర్మీ రహదారి నిర్మాణం చేపట్టగా భారతీయ ఆర్మీ నిరోధించింది. కాగా, తన సాయుధ సంపత్తిని మరింతగా పెంచుకునేందుకు అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవాలని మన ఆర్మీ సంకల్పించింది. సుమారు నలభై వేల కోట్ల రూపాయల వ్యయంతో మెషిన్ గన్‌లు, రైఫిళ్లు, ఇతర ఆధునిక సామగ్రిని సేకరించాలని ఆర్మీ నిర్ణయించుకుంది.