జాతీయ వార్తలు

నేనూ మనిషినే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతే వేగంగా స్పందించారు. దేశంలో అధిక ధరలను కోడ్ చేస్తూ రాహుల్ తన ట్విట్టర్‌లో కేంద్రంపై విమర్శలు చేశారు. 2014-2017 మధ్య పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ట్విట్టర్‌లో ఎత్తిచూపిన రాహుల్ పెరుగుదల శాతం చూపడంలో మాత్రం తప్పుదొర్లింది. దీనిపై బీజేపీ శ్రేణులు, నెటిజన్లు మండిపడ్డారు. లెక్కలు రాని నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలా అవుతారని నిలదీశారు. అయితే దీనిపై రాహుల్ కూడా అదేస్థాయిలో స్పందించారు. ‘నేనూ మానవమాత్రుడినే.. తప్పులు జరుగుతాయి’ అని ఘాటుగానే బదులిచారు. అంతటితో ఆగలేదు. ‘బీజేపీ మిత్రులకు ధన్యవాదాలు. నా తప్పులు ఇలానే ఎత్తిచూపుతూ ఉండండి. అప్పుడే సరిదిద్దుకోడానికి వీలవుతుంది’ అని ట్వీట్ చేశారు. ‘నరేంద్ర మోదీని కాదు.. మనిషిని కాబట్టే దేనిలోనూ మినహాయింపులేదు.. లవ్ యూ ఆల్’ అని ముగించారు.