జాతీయ వార్తలు

అది మా సార్వభౌమత్వానికి భంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబల్ 7: డోక్లామ్ గొడవ నుంచి ఇటీవలే బైటపడిన భారత, చైనా దేశాలు ఇప్పుడు తాజాగా మరో వివాదం మొదలైంది. భారత సైన్యానికి చెందిన ఒక డ్రోన్ ఆకాశ భాగంలోకి వచ్చి పతనం కావటం ద్వారా తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని చైనా రక్షణ శాఖ గురువారం నిరసన తెలపగా డ్రోన్ అదుపుతప్పి చైనా ఆకాశ భాగంలోకి వళ్లిందేతప్ప ఉద్దేశపూర్వకంగా పంపించింది కాదని భారత్ స్పష్టం చేసింది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ ఎప్పుడు, ఏ ప్రాంతంలోకి వచ్చిందనేది మాత్రం చైనా రక్షణ శాఖ వెల్లడించలేదు. భారత సైన్యానికి చెందిన డ్రోన్ తమ ఆకాశ ప్రాంతంలోకి రావటం అత్యంత తీవ్రమైన విషయని చైనా రక్షణ శాఖ తెలిపింది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ తమ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది, ఇది అత్యంత తీవ్రమైన విషయం, దీనిని తాము ప్రతిఘటిస్తున్నాం అని చైనా రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యాంగ్ సూలీ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా సరిహద్దు రక్షణ దళాలు బాధ్యతతో వ్యవహరించటం ద్వారా డ్రోన్ పూర్వాపరాలను తనిఖీ చేశారని జ్యాంగ్ చెప్పారు. చైనా సార్వభౌమాధికారాన్ని రక్షించేందుకు, భద్రత కల్పించేందుకు సైన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలాఉంటే తమ డ్రోన్ అదుపుతప్పి చైనా భూభాగంలోకి వెళ్లిందితప్ప దురుద్దేశంతో పంపించింది కాదని భారత రక్షణ శాఖ వివరించింది. తమ డ్రోన్ సాంకేతిక లోపంతో అదుపుతప్పి చైనా భూభాగంలోకి వెళ్లిందని రక్షణ శాఖ అభిప్రాయపడింది. రోజూ జరిపే శిక్షణా కార్యక్రమంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న డ్రోన్ అదుపు తప్పి సిక్కిం సెక్టార్‌లో చైనా భూభాగంలోకి వెళ్లిందని రక్షణ శాఖ వివరించింది. చైనా ఆకాశ ప్రాంతాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన తమకు లేదన్నారు. డ్రోన్ అదుపుతప్పిన విషయాన్ని చైనా రక్షణ శాఖ అధికారులు, సరిహద్దు రక్షణ సిబ్బందికి ముందే తెలియజేశాం, డ్రోన్ ఏ ప్రాంతంలో అదుపు తప్పిందనేది కూడా చైనా రక్షణ శాఖకు తెలియజేశామని భారత రక్షణ శాఖ తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది.
ఇదిలాఉంటే సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్ పర్వత ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలపై కన్ను పెట్టేందుకు ప్రయోగించిన డ్రోన్‌ను చైనా సైన్యం పడగొట్టిందనే మాట వినిపిస్తోంది. భారత రక్షణ శాఖకు చెందిన డ్రోన్‌ను తమ సైనికులు పడగొట్టారన్న విషయాన్ని చెప్పకుండా తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిందని మాత్రమే చైనా రక్షణ శాఖ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టులో రెండు దేశాలు డోక్లామ్ నుండి తమ సైనికులను ఉపసంహరించుకోవటం తెలిసిందే. చైనా సైన్యం తాజాగా మళ్లీ బలప్రదర్శనకు దిగుతోందని భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ ఇటీవల చెప్పడం గమనార్హం. భారత భూమిని కాజేయాలన్న చైనా వ్యూహంలో ఎలాంటి మార్పు కనిపించటం లేదని కేంద్ర రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. డోక్లామ్ నుండి సైన్యాలను ఉపసంహరించుకున్న తరువాత కూడా చైనా వ్యవహారంలో ఎలాంటి మార్పు కనిపించటం లేదని అంటున్నారు. భారత సైన్యం సిక్కిం సెక్టార్‌లో చైనా సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్‌లను ప్రయోగిస్తోందనీ, ఇలా ప్రయోగించిన డ్రోన్ ఇటీవల చైనా భూభాగంలో పతనమైందని అంటున్నారు.