జాతీయ వార్తలు

ఓట్ల కోసమే అంబేద్కర్ నామస్మరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: అంబేద్కర్ పేరుతో ఓట్లు దండుకుంటున్న పార్టీలు దేశానికి ఆయన చేసిన సేవలను తుడిచిపెట్టేసే ప్రయత్న చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. 33 ఏళ్ల క్రితం తలపెట్టిన అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్ర నిర్మాణానికి అరకొర కృషి చేయడమే ఇందుకు నిదర్శమన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఈ కేంద్రాన్ని గురువారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోదీ తాను శివ భక్తుడిని అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా వ్యంగోక్తులు విసిరారు. ‘కొందరు వ్యక్తులు పరమశివుడి గురించి మాట్లాడుతున్నారే తప్ప బాబా సాహెబ్‌ను పట్టించుకోవడం లేదు’ అని ప్రధాని అన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవ నిరుపమానమని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల స్మృతి పథం నుంచి ఆయనను తొలగించజాలరని మోదీ స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆలోచన తీరు, సిద్ధాంతం, ఆదర్శాలు నిరంతరం జాతిని జాగృతం చేసేవేనని మోదీ అన్నారు. 1992లో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచన తెరమీదకు వచ్చిందని, 23 సంవత్సరాల్లో ఏమీ జరగలేదని మోదీ తెలిపారు. అయితే 2015లో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేసి దాన్ని ఈ రోజు జాతికి అంకితం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఓట్ల కోసం అంబేద్కర్ పేరు గుర్తుకొచ్చే పార్టీలకు 23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు గుర్తుకురాలేదని కాంగ్రెస్, రాహుల్‌ను ఉద్దేశించి మోదీ అన్నారు. కులాల ప్రాతిపదికగా దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అంబేద్కర్ సామాజిక ప్రజాస్వామ్య లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని ఆయన ఆవేదన చెందారు. అయితే సమాజంలో రుగ్మతలను తొలగిస్తున్నామని, సామాజిక మార్పులు తెస్తున్నామని ఈ లక్ష్యాన్ని ప్రస్తుత తరం సాధించగలదన్న నమ్మకం తనకు ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ కేంద్రం సామాజిక, ఆర్థిక అంశాలపై కీలక పరిశోధనలకు స్ఫూర్తిదాయక కేంద్రంగా మారుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అంబేద్కర్‌కు సంబంధించిన ఐదు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మోదీ గుర్తుచేశారు. ఇది యువతకు సంబంధించిన కేంద్రమని అంబేద్కర్ ఆలోచనలను, ఆదర్శాలను అవగతం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ