జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో పొత్తుపై పొసగని సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దించే దిశగా వ్యూహాత్మకంగా సాగుతున్న సీపీఎంకు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీతోను, ఇతర లౌకిక పార్టీలతోను రాజకీయ అవగాహనను కుదర్చుకునే విషయంలో సీపీఎం పొలిట్‌బ్యూరోలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. రెండురోజులపాటు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో రెండు అంశాలను ప్రధానంగా చర్చించారు. వీటిలో ఒకటి ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రూపొందించినది కాగా, రెండోది అంతుకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ప్రకాశ్ కారత్ తయారు చేసినది. రానున్న మూడేళ్ల కాలంలో ఏరకమైన రాజకీయ వైఖరితో సీపీఎం ముందుకు సాగాలన్న దానిపై వీరిద్దరూ తమదైన రీతిలో విశే్లషణాత్మక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ముసాయిదా రాజకీయ నివేదికనూ సిద్ధం చేశారు. దీనిపై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఈ నివేదికను సెంట్రల్ కమిటీ పరిశీలనకు పంపే అవకాశం కనిపిస్తోంది. 22వ జాతీయ సమావేశంలో ఈ ముసాయిదా రాజకీయ ప్రకటనపై పొలిట్ బ్యూరో చర్చించిందని, ఇందులో జరిగిన చర్చల వివరాలను జనవరి 19, 21 తేదీల మధ్య జరిగే సెంట్రల్ కమిటీ సమావేశ పరిశీలనకు నివేదిస్తామని సీపీఎం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాంగ్రెస్, ఇతర లౌకిక పార్టీలతో పొత్తు విషయంలో ఏకాభిప్రాయం కుదరనప్పటికీ, దీనిపై సదవగాహనను పెంపొందించే ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీని ఆధారంగానే పార్టీ సెంట్రల్ కమిటీకి ఓ నివేదికను పంపే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహనతో నిమిత్తం లేకుండా ఇతర వామపక్షేతర పార్టీల సహకారంతో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ ముసాయిదాలో పేర్కొన్న ‘కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహన ఉండకూడదు’ అన్న క్లాజ్‌ను తొలగించాలని, దీనివల్ల ఇతర లౌకిక పార్టీలను కూడగట్టుకునే అవకాశం మెరుగవుతుందని ఏచూరి అభిప్రాయపడినట్టు సీనియర్ పార్టీ నాయకుడు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వాదనను కారత్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. పొలిట్ బ్యూరోలో మెజారిటీ సభ్యుల మద్దతు కలిగిన కారత్ వర్గం తన వాదనపై పట్టుబట్టింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీనే ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి, సీపీఎం కీలక లక్ష్యం మతతత్వ శక్తులను ఓడించడమే కావాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజకీయ అవగాహన కుదుర్చుకోకూడదని కారత్ తన నివేదికలో స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని, కాంగ్రెస్ పార్టీతో పొత్తును కొనసాగిస్తున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలతో అవగాహనను పెంపొందించుకోవలని ఆయన సూచించారు. అయితే, ఈ వైఖరి వాస్తవిక రీతిలో ఎంతమాత్రం ఆచరణీయం కాదని కారత్ వర్గం స్పష్టం చేసింది.
చిత్రాలు..ఏచూరి *కారత్