జాతీయ వార్తలు

తమిళనాడులో 54 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 26: తమిళనాడులో వచ్చే మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి 54 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులకు చోటు లభించింది. బిజెపి జాతీయ వెబ్‌సైట్‌లో ఉంచిన జాబితా ప్రకారం కారైకుడి మాజీ ఎమ్మెల్యే అయిన రాజా ఈసారి చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తారు. ఈ నియోజకవర్గంలో మొదటినుంచి కూడా డిఎంకె లేదా అన్నా డిఎంకె అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు, ప్రముఖ మహిళా నాయకురాలు అయిన వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు (దక్షిణ) నియోజకవర్గంనుంచి పోటీ చేస్తుండగా, మరో ఉపాధ్యక్షుడు ఎం చక్రవర్తి తిరుత్తణినుంచి పోటీ చేస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా గుర్తింపు ఉన్న రాజా 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అలందూర్‌నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా, తరచూ టీవీ చర్చల్లో కనిపించే వనతి శ్రీనివాసన్ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని మైలాపూర్ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆరు రిజర్వ్‌డ్ స్థానాలతో సహా మొత్తం 54 స్థానాలకు పార్టీ అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తంజావూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసిన కరుప్పు మురుగనాథం ఈసారి పట్టుకోటై అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు. నాగపట్నం జిల్లా వేదారణ్యం నియోజకవర్గంనుంచి బిజెపి ఒకప్పటి డిఎంకె నాయకుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్‌కె వేదారత్నంకు టికెట్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. శుక్రవారం ఢిల్లీలో తమిళనాడు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బిజెపి మిత్రపక్షాలయిన ఐజెకె, ఎన్‌జెపిలతో చర్చించిన తర్వాత రెండో జాబితాను విడుదల చేస్తామని తెలిపింది.