జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలి: నితీశ్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశవ్యాప్తంగా మద్యనిషేధాన్ని అమలుచేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నితీశ్ పార్టీ కార్యకర్తలను కోరారు. ఇక్కడ జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మద్యనిషేధాన్ని అమలుచేయడానికి, మద్యపానం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఎందుకు మద్దతు తెలపటం లేదని దుయ్యబట్టారు. గుజరాత్, బిహార్‌లో మద్యనిషేధం అమలులో వుందని, దీన్ని దేశవ్యాప్తంగా ఎందుకు అమలుచేయకూడదని ప్రశ్నించారు. మద్యపానానికి అన్ని మతాలు వ్యతిరేకమని, మద్యనిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తే అంతకుమించిన మతసామరస్యం మరొకటి ఉండదని అన్నారు.