జాతీయ వార్తలు

ద్వైపాక్షిక బంధమే లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగించే పాక్షిక అవరోధాలను తొలగించుకోవడంపై చైనా, రష్యా విదేశాంగ మంత్రులతో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌తో ద్వైపాక్షిక అంశాలపై సుష్మ వేర్వేరుగా సమావేశమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘రెండు దేశాల మంత్రులతో పరస్పరం ఆమోదయోగ్యమైన అత్యవసర అంశాలపై చర్చించారు’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘మున్ముందు జరగనున్న రష్యా, చైనా, భారత్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇరు దేశాల మంత్రులతో విడివిడిగా జరిపిన సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై లోతైన, ఆశాజనకమైన చర్చలే సాగాయి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో భారత్ నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికీ చైనా విదేశాంగ మంత్రి హాజరైనట్టు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్‌ఐసి (రష్యా, ఇండియా, చైనా) సింపోజియంలో భాగంగా మూడు దేశాల విదేశాంగ మంత్రులు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్న ఉగ్రవాదం, తీవ్రవాదం అణచివేతకు అనుసరించబోయే చర్యలపైనా లోతుగా చర్చించనున్నారు. ఇదిలావుంటే, గత వేసవిలో సిక్కిం బోర్డర్‌లో చైనాతో తలెత్తిన డోక్లాం వివాదం తరువాత ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి భారత పర్యటనకు రావడం ఇదే. 73 రోజులపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో, గత ఆగస్టు 28న ఇరు దేశాలూ సేనల మోహరింపును విరమించుకోవాలని భారత్ ప్రతిపాదించింది. ద్వైపాక్షిక చర్యలతో సమస్యను పరిష్కరించుకోవచ్చంటూ ప్రతిపాదించడం తెలిసిందే.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఐక్యతతో పనిచేయాలని భారత్, రష్యా, చైనా దేశాలు నిర్ణయించాయి. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం సమావేశమైన అనంతరం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసేందుకు, నానాటికీ విస్తరిస్తున్న వారి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కలిసి పనిచేయాలని ఈ మూడు దేశాలు తీర్మానించాయి. ముఖ్యంగా భారత సరిహద్దులో లష్కర్-ఇ-తైబా వంటి పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్ (్భరత్), వాంగ్ ఈ (చైనా), సెర్జే లావ్‌రొవ్ (రష్కా) సమావేశమై చర్చలు జరిపారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారిని, ప్రేరేపిస్తున్నవారిని, మద్దతిస్తున్న వారిని బాధ్యులుగా చేయాలని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

చిత్రం..రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో సుష్మా స్వరాజ్