జాతీయ వార్తలు

మోదీవన్నీ అభూత కల్పనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ప్రధానమంత్రులు, మాజీ సైన్యాధ్యక్షులను అవమానాలకు గురిచేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన బాధ, ఆవేదనను వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలంటూ పాకిస్తాన్ సైన్యానికి చెందిన మాజీ డైరెక్టర్ జనరల్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించటం తెలిసిందే. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఒక మాజీ సైనికాధికారి గుజరాత్ ఎన్నికల్లోకి ఎందుకు తల దూస్తున్నారని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం కోల్పోయిన మణిశంకర్ అయ్యర్ తన నివాసంలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీతో రహస్య చర్చలు జరిపారా? అంటూ మోదీ ప్రశ్నలు కురిపించటం తెలిసిందే. అయ్యర్ ఇచ్చిన ఈ విందుకు మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై మన్మోహన్ సింగ్ స్పందిస్తూ మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన విందులో గుజరాత్ ఎన్నికల గురించి ఎలాంటి చర్చ జరగలేదు, మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాలకోసం అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నారని మన్మోహన్ సింగ్ దుయ్యబట్టారు. మణిశంకర్ అయ్యర్ విందులో కేవలం భారత-పాకిస్తాన్ సంబంధాల గురించి మాత్రమే చర్చ జరిగింది, అయితే నరేంద్ర మోదీ మాత్రం ఈ విందులో గుజరాత్ గురించి చర్చ జరిపారనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మన్మోహన్ సింగ్ దుయ్యబట్టారు. విందుకు హాజరైన ఒక్కరు కూడా గుజరాత్ ఎన్నికల గురించి మాట్లాడలేదన్నారు. నరేంద్ర మోదీ తప్పుడు ఆరోపణల ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం పరువు, ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మన్మోహన్ సింగ్ దుయ్యబట్టారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మణిశంకర్ పాకిస్తాన్ రాయబార కార్యాలయం అధికారులతో విందు జరుపుకోవటం వెనకున్న మర్మం ఏమిటంటూ మోదీ అడిగిన ప్రశ్నను మన్మోహన్ కొట్టిపారేశారు.