జాతీయ వార్తలు

గుజరాత్‌కు ఎక్కువ.. దేశానికి తక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: గుజరాత్ అభివృద్ధి ఊసెత్తని అధికార బీజేపీ, ఎన్నికల ప్రచారంలో వెనకబడినట్టే కనిపిస్తోందని ఒకప్పటి మిత్రపక్షం శివసేన ఘాటుగా వ్యాఖ్యానించింది. తనను తప్పించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కుట్ర పన్నారంటూ మోదీయే చెప్పుకోవడం గుజరాత్ పరువు తీసేసినట్టు అయ్యిందని తూర్పారబట్టింది. ‘మోదీ.. తనకు తనే తప్పించుకున్నారు. దేశం, హిందువుల దర్పానికి ఆయనొక మచ్చుతునక అనుకున్నాం. కానీ, ఆయన తన వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు తీసేశారు’ అంటూ సామ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఎన్నికల ప్రచార కోణంలో చూస్తే, మోదీ గుజరాత్‌కు ఎక్కువ, భారత్‌కు తక్కువ’ అంటూ వ్యాఖ్యానించింది. తొలిదశ ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసినపుడు, ఎన్నికల కమిషన్ సరైన రీతిలో వ్యవహరించేలా మోదీ ప్రభుత్వం మార్గనిర్దేశనం చేయలేకపోయిందని శివసేన ఆరోపించింది. గుజరాత్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం అభివృద్ధికి అందనంత దూరంగా సాగుతోందని, ప్రధాని ప్రసంగాల్లో అభివృద్ధి ఊసే లేదని ఘాటుగా విమర్శించింది. ‘మోదీ తన సొంత రాష్ట్రం ఎన్నికల ప్రచారాల్లో ఒక్కోసారి భావోద్వేగంతో, మరోసారి తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. దేశానికి ప్రస్తుత ప్రధానిని ఇచ్చింది గుజరాతే. 22ఏళ్లపాటు ఆ పార్టీకి అధికారాన్ని ఇచ్చిందీ ఈ రాష్టమ్రే. అలాంటి పార్టీ, తన ఎన్నికల ప్రచారంలో ఎందుకు దిగజారిపోవాలి?’ అని ప్రశ్నించింది. ‘ఈవిఎంల స్కామ్ మాట గుజరాత్‌లో మునె్నన్నడూ వినిపించలేదు. అనుమానాలు తలెత్తినపుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. ఆ దిశగా నిబద్ధతతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైంది’ అని శివసేన పేర్కొంది. ‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఫ్జల్ ఖాన్ ప్రస్తావన తెచ్చినపుడు విలువలు దిగజారిపోతున్నాయంటూ గగ్గొలు పెట్టిన బీజేపీ, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ మొగల్ ప్రస్తావన ఉపమానాలు ఎలా తీసుకొస్తారు’ అని ప్రశ్నించింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు రాహుల్‌ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడాన్ని చూస్తుంటే, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎంపిక కంటే, గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించడం సులువన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని చురకలు అంటించింది.