జాతీయ వార్తలు

సెంట్రల్ గుజరాత్ బీజేపీ ఖాతాలోకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంఛమహల్/ఖేదా/్ఛటా ఉదయ్‌పూర్, డిసెంబర్ 11: సెంట్రల్ గుజరాత్‌లో గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు శంకర్ సిన్హా వాఘేలా మద్దతునివ్వడం కమలనాథుల్లో ఆశలు చిగురించాయి. పటీదార్ ఉద్యమం ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించామని అయితే వఘేలా నిర్ణయం తమకు కచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అహ్మదాబాద్, వదోదర, ఆనంద్, ఖేదా, పంఛమహల్, దాహోద్, ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జోస్యం చెప్పారు. తోమర్ సెంట్రల్ గుజరాత్‌లోనే మకాం వేసి 90 రోజులపాటు విస్తృత ప్రచారం చేశారు. మొత్తం 61 సీట్లకు 40 చోట్ల గెలిచితీరుతామని సోమవారం ఆయన ప్రకటించారు.‘ సెంట్రల్ గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించాను. విజయావకాశాలు మాకే ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ఎలాంటి ప్రభావమూ చూపలేదు’అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వికల్ప్‌మోర్చా అధినేత శంకర్ వాఘేలా ఇక్కడ పోటీలోలేనందున బీజేపీకి కలిసొస్తుందని తోమర్ చెప్పారు. అయితే గతంలోకంటే సెంట్రల్ గుజరాత్‌లో పోటీ గట్టిగానే ఉందన్న ఆర్‌ఎస్‌ఎస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి ధమేశ్ మెహతా‘కేంద్ర మంత్రి తోమర్ అంచనాలు నిజమవుతాయి’అని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ వాఘేలాకు మంచి పలుకుబడి ఉందని, అదే తమకు కలిసొస్తుందని బీజేపీ నేత ధీమా వ్యక్తం చేశారు. కాగా హార్దిక్ పటేల్‌తో కాంగ్రెస్ జతకట్టడం క్షత్రియులకు ఏ మాత్రం ఇష్టం లేదు. అలాగే కాంగ్రెస్‌లో పెద్ద నాయకులన్న వారిని బీజేపీ లాగేసుకుందని, ఇది విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేత కలోల్ తేల్చిచెప్పారు. వాఘేలా జూలై నెలలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆయన తప్పుపట్టారు.