జాతీయ వార్తలు

హర్యానాలో హైఅలర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 4: రిజర్వేషన్లకోసం జాట్‌లు మరోసారి ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఆదివారం నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని జాట్‌లు ప్రకటించారు. దీంతో 48 కంపెనీల పారా మిలటరీ దళాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ‘రాష్ట్ర పోలీసులతోపాటు 4,800 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించాం. వివిధ ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశాం, అదనంగా 15 సాయుధ బలగాలు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం’ అని హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) రాంనివాస్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆందోళనకారులు విధ్వంసక చర్యలకు దిగకుండా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సోనీపట్ జిల్లాలోని పశ్చిమ యుమునా కాలువ వెంబడి బలగాలను మోహరించినట్టు ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో జాట్‌ల రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా నీటి సరఫరాకు తీవ్రమైన విఘాతం ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి విస్తృతమై భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాంనివాస్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక్కచోటే శాంతియుతంగా ధర్నా చేసుకోడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో పెద్దఎత్తున జాతీయ రహదారులు దిగ్బంధం, రైల్‌రోకోలు జరిగినందున ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిఘా ఉంచారు. కనీవినీ ఎరుగని భద్రత కల్పించారు.