జాతీయ వార్తలు

కిడ్నీ రాకెట్ దర్యాప్తులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇక్కడి అపోలో ఆసుపత్రిలో జరిగిన కిడ్నీల మార్పిడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు శనివారం ముగ్గురు కిడ్నీ గ్రహీతలను, అయిదుగురు దాతలను గుర్తించారు.
వారిమీద అభియోగాల నమోదుకు పోలీసులు న్యాయ నిపుణుల అభిప్రాయం కోరారు. శ్రీలంక, ఇండోనేసియాలకు విస్తరించిన ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌లో అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక నెఫ్రాలజిస్టు వ్యక్తిగత సహాయకులు ఇద్దరు సహా అయిదుగురిని అరెస్టు చేసినట్లు దర్యాప్తులో భాగస్వామిగా ఉన్న ఒక అధికారి చెప్పారు. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఘజియాబాద్, జమ్మూకాశ్మీర్‌లోని కొల్హాపూర్‌లో ముగ్గురు కిడ్నీ గ్రహీతలను గుర్తించారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి వీరు ఒక్కో కిడ్నీ మార్పిడికోసం రూ. 40 లక్షలకు పైగా చెల్లించారు. అయితే ఇందులో పది శాతం కూడా కిడ్నీ దాతలకు అందలేదని ఆ అధికారి వివరించారు. ముగ్గురు మహిళలు సహా కిడ్నీలు ఇచ్చిన అయిదుగురిని పోలీసులు గుర్తించారని, వారిని ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని ఆ అధికారి వివరించారు. చట్టం నుంచి తప్పించుకోవడానికి కిడ్నీ రాకెట్ సభ్యులు కిడ్నీల దాతలకు, గ్రహీతలకు మధ్య బంధుత్వం ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.