జాతీయ వార్తలు

ప్రత్యేక కోర్టులకు నిధులు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం వాటికి దామాషా పద్ధతిలో నిధులు కేటాయించాలని గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల హైకోర్టులతో సంప్రదించి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. అంతేకాదు 2018 మార్చి 1 నుంచి ప్రత్యేక కోర్టులో కార్యకలాపాలు నిర్వహించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలు సేకరించాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం కేంద్రానికి సూచించింది. రెండు నెలల్లో దీని ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. దోషులుగా నిర్ధారణ అయి జీవిత కాలం నిషేధం ఎదుర్కొంటున్న నేతల కేసులు మార్చిలో విచారించాలని తెలిపింది. కేసు తదుపరి విచారణ మార్చి 7న సుప్రీం కోర్టు చేపట్టనుంది. రాజకీయ నాయకుల అవినీతి కేసులు విచారణకు కనీసం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఇంతకుముందు కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు సేకరించడానికి మరింత గడువుకావాలని కేంద్రం కోరింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన 1581 కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాలని నవంబర్ 1న సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లలో పేర్కొన్న కేసులపై కోర్టు ఆ మేరకు ఆదేశించింది. వాటిలో కేసులు పరిష్కారమయ్యాయి? ఎందరిని దోషులుగా తేల్చారు? ఎవరికి శిక్ష పడింది అన్న దానిపై వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ప్రజాప్రతినిధ్య చట్టం కింద దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.