జాతీయ వార్తలు

దినకరన్‌పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఎన్నికల అధికారులకు లంచం ఇవ్వజూపారన్న కేసులో అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకుడు టీటీవీ దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. 272 పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్‌ను ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయమూర్తి కిరణ్ బన్సల్‌కు అందజేశారు. శశికళ వర్గం నేత దినకరన్, సుకేష్ చంద్రశేఖర్, మధ్యవర్తి మల్లికార్జున, దినకరన్ స్నేహితుడు, మరో ఆరుగురి పేర్లు చార్జిషీట్‌లో పొందుపరిచారు. ఈ ఏడాది జూలైలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో దినకరన్ పేరులేదు. తాజా సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్చడం గమనార్హం. 120బీ (నేరపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలు తారుమారు) సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. అధికారులకు లంచం ఇవ్వచూపారని అవినీతి నిరోధక చట్టం కింద దినకరన్‌పై కేసులు నమోదయ్యాయి. మిగతా నిందితులందరిపైనా నేరపూరిత కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, సాక్ష్యాలు ధ్వంసం కేసులుపెట్టారు. నవంబర్ 9న కేసు విచారణ సందర్భంగా సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశించింది. దినకరన్ ఎన్నికల అధికారులకు చంద్రశేఖర్ ద్వారా డబ్బులు ఎర వేశారన్న అభియోగాలతో 710 పేజీల చార్జిషీట్ ఇంతకుముందు దాఖలు చేశారు. ఏప్రిల్ 16న చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. అన్నాడిఎంకే ఎన్నికల గుర్తు ‘రెండాకులు’ శశికళ వర్గానికి వచ్చేలా చేయడానికి ఎన్నికల అధికారులకు డబ్బు ఇవ్వచూపారని దినకరన్‌పై ఆరోపణ. ఏప్రిల్ 25న ఆయనను అరెస్టు చేయగా జూన్ 1న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.