జాతీయ వార్తలు

అక్కడి వాళ్లదే రాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భూ ఆక్రమణలు, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్వాధీన్ భారత్ సుభాష్ సేనకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. జవహర్‌బాగ్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పార్కులో తిష్టవేసిన సేన సొంతంగా ‘ఓ వ్యవస్థ’నే ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. ఇది ఎంతవరకూ వచ్చిందంటే సొంతంగా తీర్పులివ్వడం, వాటిని అమలు చేయడానికి యంత్రాంగం, ఎదురుతిరిగితే చిత్రహింసలకు గురిచేయడం జరుగుతోంది. ప్రభుత్వ భూమినుంచి ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై ఎదురుదాడికి దిగడమే కాకుండా ఓ ఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లతోపాటు 24 మందిని చంపేశారు. ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి పేరుతో ఓ బృందంగా ఏర్పడి 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. ఈ బృందానికి స్వాధీన్ భారత్ సుభాష్ సేన మద్దతు పలుకుతోంది. పోలీసులపై వేలాదిమంది మారణాయుధాలతో దాడి చేయడంతో వీరి చర్యలు బాహ్య ప్రపంచానికి తెలిశాయి. ‘రాజ్యాంగాన్ని గౌరవించరు. భారత చట్టాలను పట్టించుకోరు. మాట విననివారిని చిత్రహింసలకు గురిచేస్తారు’ అని ఆగ్రా జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ దుర్గాచరణ్ మిశ్రా వెల్లడించారు. సొంతగా ఓ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడినుంచే ‘పాలన’ సాగిస్తున్నారని ఆయన తెలిపారు. తమ మాట విననివారికి శిక్షలు విధిస్తారు. వాళ్లను ఉంచడానికి సొంతంగా జైలు, బ్యారెక్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు సాయుధులతో మూడు, నాలుగు గ్రూపులతో సొంత బెటాలియన్లు ఏర్పాటు చేసుకున్నట్టు ఆగ్రా పోలీసు కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ వెల్లడించారు. సుభాష్ సేన స్థావరంలోకి స్థానికులనుగానీ అధికారులనుగానీ అనుమతించరని, అలాగే లోపలినుంచి ఎవర్నీ బయటకు రానీయరని ఆయన తెలిపారు. లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే లోపలి నుంచి బయటకు పంపుతారన్నారు. గురువారం అర్థరాత్రి దాడిలో మూడు వేల మంది మారణాయుధాలతో దాడికి దిగినట్టు పోలీసు అధికారులు చెప్పారు. స్వాధీన్ భారత్ సేనలో నక్సల్స్ ప్రాంతానికి చెందిన వారెవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నకు ‘చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కొంతమంది అందులో ఉన్నారు’ అని చరణ్ మిశ్రా వెల్లడించారు. ఐజి మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. భారత రాజ్యాంగం, చట్టాలను గౌరవించని వీరు సొంతంగా కరెన్సీని తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అరవైలీటర్ల డీజిల్ ఒక్క రూపాయికి, 40 లీటర్ల పెట్రోల్ ఒక్క రూపాయికే అమ్మాలన్నది వారి డిమాండ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా చెప్పుకుంటున్న వారంతా రాష్టప్రతి, ప్రధాన మంత్రి పదవులకు ఎన్నికలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చిత్రం మధుర ఘర్షణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొంటూ
లక్నోలోని విధానసభ ఎదుట శనివారం ఆందోళన చేస్తున్న బిజె యువ మోర్చా కార్యకర్తలు