జాతీయ వార్తలు

‘మేక్ ఇన్ ఇండియా’ అద్భుతం కల్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 14: తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’కు అద్భుత సాక్ష్యం ‘ఐఎన్‌ఎస్ కల్వరి’ జలాంతర్గామి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన ముంబయి వద్ద సముద్ర జలాల్లో గురువారం ఉదయం ఫ్రాన్స్ సాంకేతికతతో రూపొందిన ‘కల్వరి’ని జలప్రవేశం చేయించారు. ఈ అధునాతన జలాంతర్గామి వల్ల మన నావికాదళం మరింత పటిష్టవంతమవుతుందని మోదీ అన్నారు. ‘కల్వరి’ జలాంతర్గామిపై ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ జలాంతర్గామిని తీర్చిదిద్దడంలో కృషి చేసిన వారికి ఆయన పేరుపేరునా అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రక్షణ, భద్రతకు సంబంధించి గత మూడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం మార్పుకు నాంది పలికిందని అన్నారు. శాంతి, స్థిరత్వానికి సంబంధించి భారత్‌తో కలిసి అడుగులు వేసేందుకు ఎన్నో దేశాలు నేడు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. శక్తిమంతమైన భారత్ విశ్వమానవ కల్యాణంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ‘కల్వరి’ రూపకల్పనలో సాంకేతిక సహకారాన్ని అందించినందుకు ఫ్రాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘కల్వరి’ జలప్రవేశం చేయడం 125 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని ఆయన అన్నారు. రక్షణపరంగా మనం మరింత సంసిద్ధంగా ఉండేందుకు ఈ జలాంతర్గామి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ‘కల్వరి బలాన్ని పులితో పోల్చాలి.. అందుకే దీని వల్ల మన నావికాదళం ఇంకా శక్తిని పుంజుకున్నట్టయింది..’ అని మోదీ అన్నారు.
పొరుగుదేశాలకు సాయం..
పొరుగు దేశాలకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. వరదలు, నీటి కొరత, తుపాన్లు, ఇతర ప్రకృతి విలయాల్లో శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు మనం సాయం చేశామని ఆయన గుర్తుచేశారు. పొరుగువారిని ఆదుకోవడం తన ప్రథమ కర్తవ్యమని భారత్ నిరంతరం భావిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడంలోనూ మన దేశం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సముద్ర ఉత్పత్తుల అక్రమ తరలింపును అరికట్టడంలో భారత్ ముందంజలో ఉంటుందని వివరించారు. భారత్‌ను బలహీన పరచేందుకు కొందరు ఉగ్రవాదాన్ని ఎలా ఎగదోస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని ఆయన అన్నారు. మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబం అని భారత్ భావిస్తుందని, యావత్ మానవాళి క్షేమం కోసం తన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తోందన్నారు. ఇతర దేశాలతో బంధాలు బలోపేతం అయ్యేందుకు హిందూమహా సముద్రం మనకు ఎంతగానో ఉపకరిస్తోందన్నారు.
హిందూ మహాసాగరం తమ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోందని, వివిధ పథకాల, విధానాల రూపకల్పనలోనూ ఉపయోగపడుతోందన్నారు. 21వ శతాబ్దంలో ఆసియా ప్రాంత అభివృద్ధికి హిందూ మహాసముద్రం అండగా నిలిచిందన్నారు. ఈ సముద్రానికి ఆనుకుని ఉన్న దేశాల సమస్యల పట్ల, సవాళ్ల పట్ల కూడా భారత్ ఆందోళన చెందుతుందని అన్నారు. ఆ సవాళ్లను అధిగమించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. సముద్ర రంగంలో ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఏ దేశంతో కలసి అడుగువేయాలన్నా రాజనీతి, సాంకేతికతలే తమకు ప్రాతిపదికలని ఆయన చెప్పారు.