జాతీయ వార్తలు

తల్వార్ దంపతుల విడుదలపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆరుషి హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకేసులో డాక్టర్ రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్‌లు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజేష్ ఇంట్లో పనివాడుగా ఉంటూ హత్యకు గురైన హేమ్‌రాజ్ భార్య ఖుంకళ ఈ కేసు వేశారు. ‘నోయిడా జంటహత్యల కేసు’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యోదంతంలో కోర్టులు, విచారణాధికారులు సంపన్నవర్గాలకు, పలుకుబడి ఉన్నవారికి అనుకూలంగా పనిచేసినట్లు ఖుంకళ ఆరోపించారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి సుప్రీం కోర్టుకు హాజరవుతారని తెలుస్తోంది.
టీనేజీ బాలిక ఆరుషి, పనివాడు హేమరాజ్ జంట హత్యల కేసులో నిందితులైన ఆరుషి తల్లిదండ్రులు రాజేష్, నుపుర్‌లను నిర్దోషులుగా గుర్తించి వారిని జైలు నుంచి విడుదల చేయాలని గత అక్టోబర్ 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2008లో జరిగిన ఈ జంట హత్యలపై 2013లో ఘజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. తమకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును తల్వార్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరినీ నిర్దోషులని హైకోర్టు ఈ ఏడాది అక్టోబర్‌లో తీర్పు ఇచ్చింది.