జాతీయ వార్తలు

‘ముమ్మారు తలాక్’ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ‘ముమ్మారు తలాక్’ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఇది చట్టంగా మారాక ముస్లిం భర్తలు ముమ్మారు తలాక్ చెబితే నేరంగా పరిగణిస్తారు. ‘ముస్లిం ఉమన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్’ పేరిట ఉన్న ముసాయిదా బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్నాక ముమ్మా రు తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు మూడేళ్ల కారాగార శిక్ష అమలు చేస్తారు. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని గత ఆగస్టులో సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తలాక్‌ను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు వేసిన పిటిషన్లను విచారించాక సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. దీనిపై చట్టాన్ని తీసుకురావలసిందిగా కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు ప్రకారం ‘ముమ్మారు తలాక్’ వల్ల ఇక్కట్ల పాలైన బాధిత మహిళలంతా భరణం పొందే అవకాశం ఉంది. ముస్లిం పురుషులు మూడుసార్లు ‘తలాక్’ చెప్పి అప్పటికప్పుడు భార్యలకు విడాకులిస్తున్న సంప్రదాయం మన దేశంలో ఇంకా కొనసాగుతోంది. తమ తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా ముసాయిదా బిల్లును ఈనెల 1న ఝార్ఖండ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం పంపింది. ఈ నెల 10లోగా ఈ రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంది. కాగా, బీజేపీకి చెందిన మంత్రి గిరిరాజ్ సింగ్ ‘ముమ్మారు తలాక్’ను హత్యానేరంతో పోల్చారు. అయితే, పలు ముస్లిం సంస్థలు, రాజకీయ నాయకులు మాత్రం బిల్లును వ్యతిరేకించారు. ముస్లిం మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ హిందూ స్ర్తిల గురించి ఎందుకు పెదవి విప్పరని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.