జాతీయ వార్తలు

కోర్టు బయట పరిష్కారమే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 15: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడమే ఉత్తమ మార్గమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయంతోనే అన్ని వర్గాలను కలుస్తున్నట్టు వెల్లడించారు. ‘తగవు ఎలాంటిదైనా, మిత్రత్వంతోనే తప్ప శతృత్వంతో పరిష్కరించుకోలేం’ అని రవిశంకర్ వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నేను అన్ని వర్గాలతోను చర్చలు జరుపుతున్నాను. ఈ అంశంపై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రావాలి. ఏళ్ల తరబడి సాగుతున్న వివాదాన్ని ఇకనైనా కోర్టు బయట పరిష్కరించుకోవడం ఎంతైనా ఉత్తమ మార్గం’ అని స్పష్టం చేశారు. గత నెల అయోధ్య పర్యటించి వివిధ వర్గాలను కలిసినపుడు, ఆశాజనకమైన స్పందనే లభించిందని అన్నారు. గత నెలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన అనంతరం రవిశంకర్, రోజుపాటు అయోధ్యలో గడిపారు. అయితే, అయోధ్య వివాదంపై రవిశంకర్ చొరవ తీసుకోవడాన్ని చూస్తుంటే, ఆయన ఎన్డీయే ఏజెంట్ అన్న విషయం అర్థమవుతుందన్న కాంగ్రెస్ విమర్శలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ‘వీటిపై నేను ఏమాత్రం స్పందించను. ఒక్క విషయం మాత్రం చెబుతున్నా. నేనేం చేయాలనుకున్నా, అది నా నిర్ణయంతోనే ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.