జాతీయ వార్తలు

సభలో షా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: బీజేపీ వ్యూహకర్తగా పార్టీకి ఎన్నో విజయాలు తీసుకొచ్చిన అమిత్‌షా ఇప్పుడు పార్లమెంటు సభ్యుడిగా కొత్త రాజకీయ అధ్యయనం ప్రారంభించారు. గత ఆగస్టులో పెద్దల సభకు ఎంపికైన అమిత్‌షా శుక్రవారం నాడు రాజ్యసభలో అడుగుపెట్టారు. సభాకార్యక్రమాలు ప్రారంభవవుతాయనగా 53 ఏళ్ల అమిత్‌షా సభలో ప్రవేశించారు. అప్పటికే సభలో ఆశీనులైన ఎంపీలు, పలువురు మంత్రులు బీజేపీ రథసారధికి ఘన స్వాగతం పలికారు. సభ్యులు బల్లలపై చరుస్తుండగా షా చిరునవ్వులు చిందిస్తూ తన స్థానం వద్దకు చేరుకున్నారు. ముందు వరసలో తనకు కేటాయించిన సీట్లో ఆయన ఆశీనులయారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్థానాల తరువాత అమిత్‌షాకు సీటు కేటాయించారు. రాజ్యసభలో సెమీ సర్కిల్ పద్ధతిలో సీట్ల కేటాయింపుజరిగింది. మొత్తం ఆరు బ్లాకుల కింద కేటాయించారు. అధికార పార్టీ సభ్యులు ఒక పక్క, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మరోపక్క స్థానాలు కేటాయించారు. మిగతా పార్టీలు, మిత్రపక్షాల సభ్యులకు మధ్యలో సీట్లు కేటాయించారు. కేంద్ర టెలికం మంత్రి మనోజ్ శర్మ, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్, సమాచార, ప్రసారాల మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ వ్యూహకర్తకు సాధరంగా స్వాగతం పలికారు. అమిత్‌షా తన స్థానంలో కూర్చున్న తరువాతా పలువురు ఎంపీలు వచ్చి అభినందించడం కనిపించింది. ఇప్పుడు అమిత్‌షా ఆశీనులైన స్థానంలో గతంలో ఎం. వెంకయ్యనాయుడు కూర్చునే వారు. వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతిగా ఎన్నికై, రాజ్యసభ చైర్మన్‌కా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ సీటు అమిత్‌షాకు వచ్చింది.

చిత్రం.. రాజ్యసభలో శుక్రవారం తొలిసారిగా అడుగుపెట్టిన
బీజేపీ సారథి అమిత్‌షాకు స్వాగతం పలుకుతున్న దృశ్యం